NTR30: ఆలు లేదు చూలు లేదు.. అంతా ఉత్తిత్తే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krithi Shetty Clarity On NTR30 Offer: జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలోని NTR30 సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి.. హీరోయిన్ గురించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. కచ్ఛితంగా బాలీవుడ్ భామని రంగంలోకి దింపొచ్చని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు తెరమీదకి వచ్చింది. దాదాపు ఈమె ఖరారైనట్టు ప్రచారమూ జరిగింది. కానీ, కొంతకాలం తర్వాత ఈ వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది. స్వయంగా జాన్వీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్ ఆ విషయాన్ని స్పష్టం చేశారు. తన కూతురికి టాలీవుడ్ నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదని క్లారిటీ ఇచ్చారు.
ఆ తర్వాత కొంతమంది కథానాయికల పేర్లు తెరమీదకొచ్చాయి. కానీ, ఎవరూ కన్ఫమ్ కాలేదు. ఇంతలోనే శ్రీలీల, కృతి శెట్టిల పేర్లు వినిపించాయి. తొలుత శ్రీలీలని తీసుకోవచ్చన్న వార్తలు రాగా, ఆ తర్వాత కృతిని ఫైనల్ చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని ఓ ప్రచారం ఊపందుకుంది. యువతలో, ఇండస్ట్రీలో ఆమెకున్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా.. కృతిని తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ నిర్ణయించుకున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. పైగా.. నటన పరంగానూ కృతి అదరగొడుతోంది. అందుకే, ఈ అమ్మడినే తీసుకోవాలన్న ఆసక్తి చూపుతున్నారని, త్వరలోనే ఈ వార్త అధికారికంగా రావొచ్చని గుసగుసలు వినిపించాయి. కానీ, ఈ వార్తల్లోనూ వాస్తవం లేదని తాజాగా తేలిపోయింది. స్వయంగా కృతినే ఈ క్లారిటీ ఇచ్చింది.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఓ మీడియాతో మాట్లాడిన కృతి.. తనని NTR30 చిత్రబృందం నుంచి ఎలాంటి పిలుపు రాలేదని, తాను ఆ సినిమాకు సంతకం చేయలేదని స్పష్టం చేసింది. తనకు తారక్‌తో కలిసి నటించాలనుందన్న కోరికనైతే వెలిబుచ్చింది కానీ, ఈ సినిమా ఆఫర్ వచ్చిందన్న విషయంలో మాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. దీంతో, కథ మళ్లీ మొదటికే వచ్చింది. మేకర్స్ కథానాయికగా ఎవరిని సెలెక్ట్ చేస్తారో, కాలమే సమాధానం చెప్పాలి.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..