Kalyan Ram: NTR30 ఆలస్యానికి అసలు కారణం అదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalyan Ram Reveals Real Reason Behind NTR30 Delay: ‘NTR30’ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలం అవుతోన్నా.. ఇంతవరకూ సెట్స్ మీదకి వెళ్లలేదు. అదిగో అప్పుడు, ఇదిగో ఇప్పుడు అంటూ.. ఆలస్యం చేస్తూనే ఉన్నారు. ఆమధ్య ఫిబ్రవరిలో పట్టాలెక్కబోతోందని జోరుగా ప్రచారాలు జరిగాయి కానీ, అలా జరగలేదు. ఈ నేపథ్యంలోనే ‘స్క్రిప్ట్’ ఫైనల్ కాకపోవడం వల్లే ఈ చిత్రం డిలే అవుతోందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇది నిజమేనని పరోక్షంగా ఖరారు చేశాడు నందమూరి కళ్యాణ్ రామ్.
NTR30 సినిమాను యువసుధ ఆర్ట్స్ సంస్థతో కలిసి తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే! తాజాగా తన ‘బింబిసార’ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కళ్యాణ్.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్30 ఆలస్యానికి గల అసలు కారణాన్ని రివీల్ చేశాడు. ‘‘NTR30 ఎప్పుడో ప్రారంభం అవ్వాల్సింది. అయితే.. ఆర్ఆర్ఆర్ రాకతో ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. ఆ సినిమా తర్వాత తారక్ పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. తద్వారా తాను చేయబోయే ప్రతీ చిత్రం పాన్ ఇండియా సినిమాగా రూపొందాలని తారక్ నిర్ణయించాడు. దీంతో.. అన్నీ చక్కగా కుదరాలని కొరటాల శివ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు’’ అని కళ్యా్ణ్ వెల్లడించాడు.
Also Read
చూస్తుంటే.. తారక్ పాన్ ఇండియా హీరోగా అవతరించిన తర్వాత కొరటాల మొత్తం స్క్రిప్ట్ మార్చేసినట్టు కనిపిస్తోంది. తారక్ సూచనల మేరకు హిందీ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు స్క్రిప్టులో మెరుగులు దిద్దుతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి స్టాండర్డ్స్‌ని అందుకోవాలంటే, అంత మామూలు విషయం కాదు కదా! తారక్ సైతం స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అర్థమవుతోంది.
తాజావార్తలు
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
-
Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!