గత కొంతకాలంగా టాలీవుడ్ సక్సెస్ లేక వెలవెలపోతోంది. విడుదలైన సినిమాలు పట్టుమని ఒకటి రెండు రోజులు కూడా ఆడియన్స్ ను థియేటర్లకు రాబట్టలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవే నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘సీతారామం’. వీటిని ఎన్టీఆర్ ఆర్ట్స్, అశ్వనీదత్ కి చెందిన స్వప్న సినిమా నిర్మించాయి. వీటిలో ‘బింబిసార’ సోషియోఫాంటసీ కాగా ‘సీతారామం’ ఫీల్ గుడ్ మూవీ. ఈ రెండు సినిమాలు ట్రైటర్స్, టీజర్స్ తో పాటు పాటలతోనూ ఆకట్టుకోవడంతో హిట్ కళ కనబడుతోందని అంటున్నారు.
ఇదిలా ఉంటే తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ సందడి చేశాడు. అంతే కాదు సినిమా చూశానని, కళ్యాణ్ అన్న కెరీర్ ని ‘బింబిసార’కు ముందు ‘బింబిసార’కు తర్వాత అన్నట్లు ఉంటుందని చెప్పటంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఇక ‘సీతరామం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ సందడి చేయబోతున్నాడు. వైజయంతి బ్యానర్ లో ‘ప్రాజెక్ట్ కే’ సినిమా చేస్తున్న ప్రభాస్ ‘సీతారామం’ సినిమా ప్రచారంలో తనూ ఓ చేయి వేస్తున్నాడన్నమాట. దీంతో ఒకే రోజు విడుదల కానున్న ‘బింబిసార, సీతారామం’ సినిమాలలో దేనికి ఆడియన్స్ పట్టంకడతారన్నది ఆసక్తికరంగా మారంది. దానికి తోడో టాప్ హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్ చెరో సినిమాను భుజాన వేసుకోవడంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ వర్సెస్ ప్రభాస్ గా మారిపోయింది. ఇది ఆయా సినిమాల ఓపెనింగ్స్ పై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. గత కొంత కాలంగా విడుదల అవుతున్న సినిమాలకు ఓపెనింగ్స్ లేక సరైన టాక్ రాక టాలీవుడ్ నిరాశల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈవారం విడుదల కానున్న ‘బింబిసార, సీతారామం’ సినిమాలైన ఎన్టీఆర్, ప్రభాస్ పుణ్యమా అని డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టి టాలీవుడ్ లో కొత్త కళను నింపుతాయేమో చూడాలి.