Prashanth Neel Gives Shooting Update Of NTR31 Project: ‘ఆర్ఆర్ఆర్’ పుణ్యమా అని జూ. ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించడంతో.. అతని తదుపరి చిత్రాలకు ఇప్పట్నుంచే మంచి క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా.. కొరటాల శివ తర్వాత ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్న సినిమాకైతే, విపరీతమైన బజ్ నెలకొంది. అందుకే.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడొస్తాయా? అంటూ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాంటి ఫ్యాన్స్‌కి ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ పండగలాంటి వార్త చెప్పాడు. సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న ముహూర్తాన్ని రివీల్ చేశాడు.
చాలాకాలం తర్వాత తారసపడడంతో, మీడియా NTR31కి సంబంధించిన ప్రశ్నల్ని ప్రశాంత్ నీల్‌కి సంధించింది. తొలుత ఓ జర్నలిస్ట్ ఈ మూవీ గురించి ఏదైనా ఒక విషయం చెప్పండని ప్రశ్నిస్తే.. ‘ఏం చెప్పాలి? సినిమా కథ చెప్పాలా?’ అంటూ ప్రశాంత్ ఛలోక్తులు పేల్చాడు. ఆ తర్వాత ఎప్పట్నుంచి షూట్ స్టార్ట్ అవుతుందని అడిగితే.. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ప్రారంభించాలని అనుకుంటున్నామని ఆ డైరెక్టర్ రివీల్ చేశాడు. అంటే.. ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లేందుకు మరో ఎనిమిది నుంచి పది నెలల సమయం పడుతుందన్నమాట! ఈ లెక్కన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది 2024లోనే! అది కూడా నిరంతరంగా షూటింగ్ నిర్వహిస్తే.. లేదంటే మరింత కాలం వెయిటింగ్ తప్పదు.
నిజానికి.. ముందుగా అనుకున్న ప్లాన్స్ ప్రకారం పనులన్నీ సవ్యంగా సాగి ఉంటే, ఈ ఏడాది చివర్లోనే NTR31 సెట్స్ మీదకి వెళ్లేది. కానీ.. కరోనా కారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇటు, కొరటాల శివతో తారక్ కమిటైన సినిమా సైతం వాయిదాల మీద వాయిదా పడుతూనే ఉంది. అందుకే.. NTR31 ప్రాజెక్ట్ జాప్యమవుతూ వస్తోంది. అసలు.. తారక్, కొరటాల శివ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న విషయంపై కూడా ఇంతవరకూ క్లారిటీ లేదు.