Interfaith marriage: జార్ఖండ్‌కి చెందిన ముస్లిం యువకుడు, హిందూ అమ్మాయిలకు సొంత రాష్ట్రంలో బెదిరింపులు ఎదురుకావడంతో కేరళ వీరి అండగా నిలిచింది. జార్ఖండ్‌కి చెందిన మహ్మద్ గాలిబ్, ఆశా వర్మలు ప్రేమించుకున్నారు. వీరిద్దరి మతాలు వేరు కావడంతో వారి కుటుంబాల నుంచి పొరుగువారి నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ‘‘లవ్ జిహాద్’’కి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో బెదిరింపులు ఎక్కువ అయ్యాయి.
Jharkhand: శివరాత్రి పర్వదినం రోజు జార్ఖండ్ హజారీబాగ్‌లో మత ఘర్షణలు చెలరేగాయి. హజారీబాగ్‌లోని డమ్రౌన్ గ్రామంలో శివరాత్రి డెకరేషన్‌పై ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. రాళ్ల దాడి చేయడంతో పాటు, పలు వాహనాలు, షాపులకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చి, శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించేందుకు భారీగా పోలీసులు మోహరించారు.
మహా కుంభమేళా బుధవారంతో ముగుస్తోంది. దీంతో చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇదిలా ఉంటే జార్ఖండ్ రాజ్యసభ ఎంపీ మహువా మాజీ కారు ప్రమాదానికి గురైంది.
జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని చకులియా పోలీస్ స్టేషన్ పరిధి జోడ్సా గ్రామంలో మేకను దొంగిలించారనే ఆరోపణతో ఇద్దరు వ్యక్తులను కొట్టి చంపారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకునని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ ఘటనలో పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
జార్ఖండ్‌లోని ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో లక్షల రూపాయల కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ దర్యాప్తు తర్వాత, వినోబా భావే విశ్వవిద్యాలయంలో జరిగిన రూ.44 లక్షల కుంభకోణం నిజమని తేలింది. ఈ కుంభకోణం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ముకుల్ నారాయణ్ దేవ్ హయాంలో జరిగింది.
ఆంధ్ర, తెలంగాణతో పాటు 12 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించారు. ఐటీ రియల్ లైఫ్ బంటి బబ్లీ కేసులో సోదాలు నిర్వహిస్తోంది. భువనేశ్వర్‌లో అరెస్ట్ అయిన హన్సిక అనిల్ కుమార్ మహంతి కేసులో సోదాలు జరుగుతున్నాయి. హన్సిక, అనిల్ ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ అల్లుడుగా చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడ్డారు. 12 ప్రాంతాల నుంచి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రిన్సిపల్ సెక్రెటరీ పేరుని వాడుకున్నారు. ప్రభుత్వంలో పనులు చేయిస్తామంటూ పలు…
Jharkhand: భార్యతో గొడవ భర్తతో పాటు మరో నలుగురి ప్రాణాలను తీసింది. బావిలో దూకిన వ్యక్తిని రక్షించేందుకు యత్నించిన మరో నలుగురు చనిపోయిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ జిల్లాలో చోటు చేసుకుంది. సుందర్ కర్మాలి(27) అనే వ్యక్తి తన భార్య రూపాదేవితో గొడవ పడిన తర్వాత బావిలో దూకాడు.
జార్ఖండ్‌లో బంగ్లాదేశ్ చొరబాట్లు ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. జనాభా కంటే ఎక్కువ ఓటరు కార్డుల వ్యవహారం అసెంబ్లీ ఎన్నికల్లో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో అధికార జేఎంఎంపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో గెలవడానికి బంగ్లాదేశీయుల పేరుతో నకిలీ ఓట్లు వేయించారని బీజేపీ ఆరోపించింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తాజాగా కేబినెట్ విస్తరణ చేశారు. గురువారం 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జేఎంఎం నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురు, ఆర్జేడీ నుంచి ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు.
Crime News: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన లివింగ్ ఇన్ పార్ట్నర్ను దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత శరీరాన్ని 40 నుంచి 50 ముక్కలుగా నరికిన ఘటన.. ఖుంటి జిల్లాలోని జరియాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.