జార్ఖండ్‌లో రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయి. అధికార మార్పిడి జరుగుతుందంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. హేమంత్ సోరెన్ సర్కార్.. కమలంతో జతకట్టబోతుందంటూ ఉధృతంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో జేఎంఎం పార్టీ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేసింది.
Jharkhand: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా, చాయిబాసాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. చాయిబాసాలోని సదర్ ఆసుపత్రిలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించినట్లు తేలింది. దీనిపై జార్ఖండ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించి, విచారణకు ఆదేశించడంతో రాంచీ నుంచి ఆరోగ్య శాఖ బృందం విచారణ కోసం చాయిబాసా చేరుకుంది. రాంచీ నుంచి వచ్చిన వైద్యుల బృందం తొలుత సదర్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూన(PICU)ని తనిఖీ చేసింది.…
Ranchi: జార్ఖండ్‌లోని రాంచీలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. ఒక హోటల్ యజమాని తన రెస్టారెంట్‌లోనే కాల్పులకు గురై హత్య చేయబడ్డాడు. ఓ వ్యక్తి రెస్టారెంట్ లో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. పొరపాటున నాన్‌వెజ్ బిర్యానీ వడ్డించడంపై జరిగిన వివాదమే ఈ హత్యకు దారితీసినట్లు సమాచారం. కాంకే – పిథోరియా రోడ్డులో ఉన్న ‘చౌపాటీ’ అనే రెస్టారెంట్‌కు చెందిన యజమాని విజయ్ కుమార్ ను శనివారం అర్ధరాత్రి దుండగులు కాల్చి చంపారు. హత్య సమాచారం…
Witchcraft: మూఢనమ్మకాలు ముగ్గురి ప్రాణాలను తీశాయి. జార్ఖండ్‌లో మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని నరికి చంపారు. రాష్ట్రంలోని లోహార్డాగా జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. పెష్రార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేక్రాంగ్ బార్టోలి గ్రామంలో బుధవారం రాత్రి ఈ హత్యలు జరిగాయి. మృతులను లక్ష్మణ్ నగేసియా (47), అతని భార్య బిఫాని నగేసియా (45), వారి తొమ్మిదేళ్ల కుమారుడు రాంవిలాస్ నగేసియాగా గుర్తించారు.
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టులకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మావోల నుంచి కాల్పులు విరమణ ప్రతిపాదన వచ్చిన తర్వాత, ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులతో కాల్పుల విరమన ప్రసక్తే లేని ఆదివారం అన్నారు. శాంతిని కోరుకునే వారు వెంటనే లొంగిపోవాలనే హెచ్చరికలు జారీ చేశారు.
దేశంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌లో అనేక మంది మావోలను అంతమొందించారు. లొంగిపోండి.. లేదంటే జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఇప్పటికే మావోలకు కేంద్రం సూచించింది.
జేఎంఎం వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ భౌతికకాయానికి బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంపై సోరెన్ ఎక్కి ఎక్కి ఏడ్చారు.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు పితృవియోగం కలిగింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి సోరెన్ శిబు తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Wife Kills Husband: మేఘాలయలో రాజా రఘువంశీ అనే వ్యక్తిని భార్య సోనమ్ హత్య చేసిన వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హనీమూన్ పేరుతో మేఘాలయ తీసుకెళ్లి, కిరాయి హంతకులతో భార్య హత్య చేయించింది. ఈ హత్యకు సోనమ్, ఆమె లవర్ రాజ్ కుష్వాహాలు ప్లాన్ చేశారు. ఈ హత్య జరిగిన తర్వాత ఇలాంటి మరో సంఘటన చోటు చేసుకుంది.
Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలో దారుణం సంఘటన వెలుగులోకి వచ్చింది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు వెళ్లిన 17 ఏళ్ల గిరిజన బాలికపై 10 మంది అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. శుక్రవారం సుందర్ పహారీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. నిందితుల్లో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.