Train Accident : ఝార్ఖండ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఝార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ లో ఈ ఘోర రైలు ప్రమాదం మంగళవారం తెల్లవారు ఝామున 3.30గంటల ప్రాంతంలో జరిగింది. ఫరక్కా నుంచి లాల్మాటియాకు వెళ్తున్న గూడ్స్ రైలు, బర్హెట్ వద్ద ఆగి ఉన్న మరో గూడ్స్ రైలును ఢీకొట్టింది. రైళ్లు ఢీకొనడంతో రెండు ఇంజిన్లలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లోకో పైలెట్లతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపు చేశారు. కాగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also : Samantha : నాకు రూల్స్ పెడితే నచ్చదు..