కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి భారీ షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో ఆయన చిక్కుల్లో పడ్డారు. జార్ఖండ్‌లోని చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రాహుల్‌గాంధీకి నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది.
దేశంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్ర నేత బసవరాజు హతమయ్యాడు. ఇతడిపై రూ.కోటికి పైగా రివార్డు ఉంది.
పెళ్లి తర్వాత భార్యను భర్త.. భర్తను భార్య మోసం చేసుకోవడం ప్రస్తుతం కామన్‌గా మారింది. భర్త తన భార్యను మోసం చేయడం, భార్య వేరొకరి కోసం భర్తను మోసం చేయడం వంటి వార్తలు ప్రతిరోజూ అనేకం వస్తునే ఉన్నాయి. తాజాగా జార్ఖండ్ జంషెడ్‌పూర్‌లోని ఆదిత్యపూర్ నగరం నుంచి ఇలాంటి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, నలుగురు పిల్లల తల్లి తన ఇంటిని వదిలి తన ప్రియుడి వద్దకు వెళ్లింది. ఆమె అతనితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవించడం…
జార్ఖండ్ రాష్ట్ర కర్ణి సేన అధ్యక్షుడు వినయ్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తలలో బుల్లెట్ కనిపించింది. ఇక మృతదేహం పక్కన ఒక పిస్టల్ కనిపించింది. వినయ్ సింగ్ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం ఫిర్యాదు చేశారు.
జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బొకారో జిల్లాలోని లాల్పానియా ప్రాంతంలోని లుగు కొండల్లో సోమవారం ఉదయం నుంచి కాల్పులు జరుగుతున్నాయి. రిజర్వ్ పోలీస్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.
BJP MP: వక్ఫ్ సవరణ చట్టంపై విచారణ, రాష్ట్రపతికి బిల్లుల విషయంలో సుప్రీంకోర్ట్ డెడ్‌లైన్ విధించడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై బీజేపీలోకి కొంత మంది సుప్రీంకోర్టుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, సుప్రీంకోర్టుపై బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది.. అంతేకాదు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తే కాల్పుల విరమణ కూడా చేస్తామని కేంద్ర కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.. ఇందుకు సంబంధించి కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది.. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు..
Train Accident : ఝార్ఖండ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఝార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ లో ఈ ఘోర రైలు ప్రమాదం మంగళవారం తెల్లవారు ఝామున 3.30గంటల ప్రాంతంలో జరిగింది. ఫరక్కా నుంచి లాల్మాటియాకు వెళ్తున్న గూడ్స్ రైలు, బర్హెట్ వద్ద ఆగి ఉన్న మరో గూడ్స్ రైలును ఢీకొట్టింది. రైళ్లు ఢీకొనడంతో రెండు ఇంజిన్లలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లోకో…
జార్ఖండ్‌లో ఘోరం జరిగింది. చైబాసాలోని జగన్నాథ్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పువాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో నలుగురు పిల్లలు సజీవ దహనం అయ్యారు.
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రజలు రంగుల్లో మునిగితేలుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుని ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. స్నేహితులు, సన్నిహితులు పాటలకు స్టెప్స్ వేస్తూ సందడి చేస్తున్నారు. అందరూ ఒక చోట చేరి కలర్ ఫుల్ రంగులను చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి రంగులు పూసుకుంటూ.. డ్యాన్సులు వేస్తూ... హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రెయిన్ డ్యాన్సులు, మడ్ డ్యాన్సులు లాంటి వెరిటీ ప్రోగ్రామ్ లతో…