Hemant Soren: న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని హేమంత్ సోరెన్ అతని సతీమణి, గండే నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కల్పనా సోరెన్ కలిశారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అద్భుత విజయం తర్వాత జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నవంబర్ 26న జరగనుంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి బంపర్ విజయం, యూపీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. మహారాష్ట్రలో ఓట్లు పొందేందుకు వీర్ సావర్కర్‌పై తప్పుడు ఆరోపణలు చేయడంపై కాంగ్రెస్ తాత్కాలికంగా నిలిపివేసిందని ప్రధాని పేర్కొన్నారు.
జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఇండియా భారీ విజయం సాధించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41ని దాటేసింది. ఇండియా కూటమి 56 స్థానాల్లో విజయం సాధించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, అధికార మహాయుతి గెలుపు స్పష్టమైంది. కాగా, ఎంవీఏ ప్రస్తుతం 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలోని 288 స్థానాలకు అక్టోబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరిగింది. విశేషమేమిటంటే.. రాష్ట్రంలో 65 శాతానికి పైగా ఓటింగ్ జరగడంతో 30 ఏళ్ల రికార్డు బద్దలైంది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ జయకేతనం ఎగురవేసింది. జేఎంఎం కూటమి 56 స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్రంలో 81 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 41 దాటుకుని విజయం సాధించింది.
జార్ఖండ్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అన్ని విధాలా ప్రయత్నించినా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీంతో పార్టీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. చివరకు బీజేపీ ఎక్కడ తప్పు చేసిందనేది ప్రశ్న పార్టీ నేతల్లో తలెత్తుతోంది.
ఆర్థిక రాజధాని, వ్యవసాయం లో కీలక పాత్ర పోషించే మహారాష్ట్ర లో బీజేపీ గెలవడం సంతొషమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిన డబల్ ఇంజన్ సర్కార్ పై మహారాష్ర్ట ప్రజలు అత్యధిక ఓట్లు, సీట్లు ఇచ్చారని, గత పార్లమెంట్ ఎన్నికల్లో రిజర్వేషన్ లు ఎత్తివేస్తారని చేసిన ప్రచారం తో కాంగ్రెస్ లబ్ధి పొందిందన్నారు.
Harish Rao : మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీ ప్రజలు నమ్మలేదు అని స్పష్టం అయ్యిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా.. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారని, తెలంగాణలో మహిళలకు ₹ 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్ర లో ₹3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసారా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది…
Election Results 2024 Live UPDATES: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 48 శాసన సభ స్థానాలకు, రెండు పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి.