T20 WorldCup: ఈనెల 23 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా ఆటగాళ్లు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నారు. రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోని మొత్తం 14మంది ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ సభ్యులు రెండ్రోజుల క్రితమే విమానంలో ఆసీస్ వెళ్లారు. అయితే గాయం కారణంగా టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. దీంతో అతడి స్థానంలో బీసీసీఐ ఎవరినీ నియమించలేదు. ఈ నేపథ్యంలో బుమ్రా స్థానంలో ఎంపికయ్యే ఆటగాడు ఆస్ట్రేలియా…
Team India: టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అతడి స్థానంలో మరో ఆటగాడిని త్వరలో ఎంపిక చేస్తామని తెలిపింది. దీంతో బుమ్రా స్థానంలో ఎవరు ఎంపికవుతారనే చర్చలు మొదలయ్యాయి. సీనియర్ బౌలర్ షమీని తీసుకుంటారా లేదా దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రాణించిన దీపక్ చాహర్‌ను ఎంపిక చేస్తారా అంటూ పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సునీల్ గవాస్కర్ లాంటి మాజీ…
టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతూ టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడంటూ వచ్చిన కథనాలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. బుమ్రా టీ20 వరల్డ్ కప్‌కు దూరం కాలేదని స్పష్టం చేశారు.
టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీం ఇండియాకు మరో గట్టి దెబ్బే తగలింది. ఇప్పటికే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. మోకాలి సర్జరీ చేయించుకొని రెస్ట్ లో ఉన్నాడు. మరో ఆల్‌రౌండర్‌గా ఉపయోగపడతాడని భావించిన శార్దూల్ ఠాకూర్ కూడా గాయంతో ఆసీస్‌తో సిరీస్‌కు ముందే జట్టు నుంచి వైదొలిగాడు. ఇప్పుడు వెన్నునొప్పితో బూమ్రా కూడా తప్పుకోవడంతో… వరుస గాయాలు టీం ఇండియాను కలవరపెడుతున్నాయి. గత ప్రపంచకప్‌లో పేవలమైన ప్రదర్శనతో… గ్రూప్ స్టేజ్ లోనే భారత్ ఇంటిముఖం పట్టింది. ఓటమికి…
T20 World Cup: వచ్చేనెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం సెలక్టర్లు భారతజట్టును ప్రకటించారు. గాయాల నుంచి కోలుకున్న స్టార్ బౌలర్ బుమ్రా, కీలక బౌలర్ హర్షల్ పటేల్ జట్టులో స్థానం సంపాదించారు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకున్నారు. మిగతా టీమ్ అంతా దాదాపు ఆసియా కప్‌లో ఆడిన జట్టునే పరిగణనలోకి తీసుకున్నారు. అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ స్థానంలో బుమ్రా, హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చారు. అయితే షమీని స్టాండ్ బైగా ప్రకటించడం…
T20 World Cup: అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం ఈనెల 16న బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి మేటి జట్లన్నీ టీ20 ప్రపంచకప్ కోసం తమ జట్టును ప్రకటించేశాయి. అయితే ఇటీవల ఆసియాకప్‌లో టీమిండియా ఘోర వైఫల్యం చెందడంతో టీ20 ప్రపంచకప్‌కు జట్టు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆల్‌రౌండర్ జడేజా మోకాలి గాయంతో జట్టుకు దూరం కావడం భారత జట్టుపై తీవ్ర…
Team India: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఆసియా కప్ తరహాలోనే టీ20 ప్రపంచకప్‌కు కూడా టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమైన స్టార్ పేసర్ బుమ్రా.. టీ20 ప్రపంచకప్‌లో కూడా పాల్గొనడం అనుమానంగా మారింది. గతంలోని గాయం తిరగబెట్టడంతో బుమ్రా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు జట్టును…