గత కొన్నిరోజులుగా గాయంతో బాధపడుతున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై తాజా అప్‌డేట్ వచ్చింది. అతను బౌలింగ్ చేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో బుమ్రా బౌలింగ్ చేస్తున్న తీరు భారత క్రికెట్‌కు మంచి సంకేతాలు ఇస్తోంది. ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి అలాంటి సమయంలో బుమ్రా టీమ్ లోకి వస్తే.. టీమిండియా బలపడుతుంది. ఇంతకు ముందు ఉన్న బుమ్రాలా తన ఫామ్ ను కొనసాగిస్తే.. ప్రత్యర్థులకు హడలే. ఐతే ఈ వీడియోలో బుమ్రా బౌలింగ్ పూర్తి ఫిట్ నెస్ కోసం ప్రయత్నాలు చేస్తునట్లుగా తెలుస్తోంది.
TS Cabinet: మరికాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం
బుమ్రా బౌలింగ్‌కి సంబంధించిన ఆ వీడియోలో.. తను పూర్తి రిథమ్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. కొన్నిసార్లు రౌండ్ ది వికెట్ మరి కొన్నిసార్లు ఆఫ్ ది వికెట్ బౌలింగ్ చేస్తున్నాడు. అతను ప్రతి ఎండ్ నుండి బ్యాట్స్‌మన్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ బౌలింగ్ చేసే విధానం చూస్తుంటే.. టీమిండియాకు త్వరలోనే తిరిగి వచ్చే దిశగా వేగంగా ప్రయత్నిస్తుడని అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు బుమ్రా ఫిట్ నెస్ గురించి బీసీసీఐ సెక్రటరీ జై షా అప్‌డేట్ ఇచ్చారు. అయితే బుమ్రా బౌలింగ్ వీడియో NCAకి సంబంధించినది.
RS Praveen Kumar: అసైన్డ్ భూములలో ఎవరి ఫామ్ హౌస్ లు ఉన్నాయో బయట పెట్టాలి..!
మరోవైపు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో బుమ్రా చోటు దక్కించుకుంటాడని కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. ఏమైనప్పటికీ.. అతను ఆసియా కప్, ప్రపంచ కప్‌లో ఆడవలసి వస్తే.. అంతకంటే ముందు అతనికి మ్యాచ్ ఫిట్‌నెస్ అవసరం. అది అతను మ్యాచ్ ఆడినప్పుడే ఫిట్ నెస్ పొందగలడు.