తాజాగా ఈ జాబితాలో స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా చేరాడు. ప్రస్తుతం అతడు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అశ్విన్ గాయం తీవ్రత గురించి ఇంకా తెలియరాలేదు.. బీసీసీఐ ఇప్పటికే అశ్విన్ గాయంపై ఆరా తీస్తోంది. గాయం మరీ తీవ్రమైనది అయితే అతను కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశం ఉంది.
బీసీసీఐలో ఉన్న చాలామందిక కూడా జస్ప్రిత్ బుమ్రా గాయం స్టేటస్ గురించి తెలీదు. కేవలం ఎస్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం బుమ్రాని స్పెషల్ గా పర్యవేక్షిస్తున్నాడు.
కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు శస్త్రచికిత్స పూర్తయినట్లు తెలుస్తోంది. శస్త్ర చికిత్స కోసం బుమ్రాను బీసీసీఐ న్యూజిలాండ్‌కు పంపిచింది.
గత ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. వచ్చే నెలాఖరిలో ప్రారంభమయ్యే ఐపీఎల్ ద్వారా రీఎంట్రీ ఇస్తాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
శ్రీలంకతో జరిగిన తొలివన్డేలో టీమిండియా యువ పేసర్, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.