భారత్, ఇంగ్లండ్ మధ్య రేపటి (జులై 1) నుంచి ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ మోయిన్ అలీ భారత్‌ను హెచ్చరించాడు. ఇంతకుముందు కంటే ఇంగ్లండ్ జట్టు ఇప్పుడు పటిష్టంగా తయారైందని, ఇటీవల న్యూజీల్యాండ్ను 3-0తో క్లీన్‌స్వీప్ ఆ జట్టు మరింత జోష్ మీద ఉందని, అలాంటి ఇంగ్లండ్‌ను ఆపడం చాలా కష్టమేనని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ గతేడాదే ఈ ఐదో టెస్ట్ మ్యాచ్ జరిగి ఉంటే, టీమిండియాకే అనుకూలమైన ఫలితం వచ్చేదని..…
జూన్ 9వ తేదీ నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే! అయితే.. రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లీ, బుమ్రాలను విశ్రాంతి పేరిట ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. కొంతకాలం నుంచి తీరిక లేకుండా ఆడుతున్న ఈ సీనియర్లకు విశ్రాంతి తప్పదని చెప్పి, సెలెక్టర్లు తుది జట్టులోకి వారిని తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ స్పందిస్తూ.. రోహిత్ శర్మకు విశ్రాంతీ తీసుకోవాల్సిన…
ఉమ్రాన్ మాలిక్.. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న ఓ పెను సంచలనం. గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించే ఇతగాడు.. ఇప్పుడున్న ఐపీఎల్ బౌలర్స్లోనే ఫాస్టెస్ట్ బౌలర్‌గా చెలామణీ అవుతున్నాడు. ఈ టోర్నీలో ఇతను కనబర్చిన ప్రతిభకు సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. కచ్ఛితంగా ఉమ్రాన్‌కు టీమిండియాలో చోటు దక్కుతుందని క్రీడా నిపుణులే కాదు, మాజీలు సైతం అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే.. పాక్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ మాత్రం ఉమ్రాన్‌పై ప్రశంసలు కురిపిస్తూనే, భారత్‌పై విషయం…
ఐపీఎల్లో సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓ దశలో 200 స్కోరు చేసేలా కనిపించిన కోల్‌కతా తక్కువ పరుగులు చేసిందంటే దానికి కారణం బుమ్రా. అతడు 4 ఓవర్లు బౌలింగ్ వేసి ఓ మెయిడిన్ సహా 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు.…
ముంబైలోని డా. డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఈ ఐపీఎల్ సీజన్‌లోని 56వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి ముంబై బౌలింగ్ ఎంచుకోగా, కోల్‌కతా బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. తొలుత కోల్‌కాతా టాపార్డర్ సృష్టించిన విధ్వంసం చూసి.. ముంబై ముందు భారీ లక్ష్యం పెడతారని అంతా అనుకున్నారు. గత కొన్ని మ్యాచుల్లో పెద్దగా…
బెంగళూరు వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో (డే/నైట్) టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్సులో 109 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీలంక బ్యాటర్లలో మథ్యూస్(43), డిక్వెల్లా(21) తప్ప ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు, అశ్విన్, షమీ తలో 2 వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. ఓవర్‌నైట్ స్కోరు 86/6తో రెండో రోజు ఆట ఆరంభించిన శ్రీలంకను చుట్టేయడానికి రోహిత్ సేనకు ఎంతో సమయం పట్టలేదు.…
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు షాక్ తగిలింది. భారత స్టార్ పేసర్ బుమ్రాకు గాయమైంది. సఫారీల తొలి ఇన్నింగ్స్ సందర్భంగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న బుమ్రా గాయపడటం టీమిండియాను ఆందోళనకు గురిచేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఐదో బంతి వేస్తున్న సమయంలో బుమ్రా పాదం మెలిపడింది. దీంతో కింద కూర్చుండిపోయిన అతడు తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు. Read Also: రోహిత్ స్థానంలో వన్డేలకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అయితే బుమ్రా పరిస్థితిని గమనించిన టీమిండియా…
భారత మాజీ ఆటగాడు.. ప్రస్తుత క్రికెట్ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా ఈ ఏడాదికి సంభందించిన తన టెస్ట్ జట్టును ప్రకటించాడు. కానీ అందులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే పేసర్ బుమ్రాలకు చోటివ్వలేదు. అయితే ఈ 2021కి సంబంధించిన తన టెస్ట్ జట్టులో ఓపెనర్లుగా భారత ఓపెనర్ రోహిత్ శర్మతో పాటుగా శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నే ను ఎంచుకున్నాడు. అలాగే వన్ డౌన్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ను తీసుకున్న చోప్రా…
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్థానంలో సెలక్టర్లు రోహిత్ శర్మను టీంఇండియా సారథిగా నియమించిన విషయం తెల్సిందే.. ఇప్పటికే రోహిత్ ముంబై ఇండియన్స్ సారథిగా ఐదు టైటిల్‌ను ఆ జట్టుకు అందించాడు. రోహిత్ శర్మపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీంఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ రాణించగలడని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్‌కు మంచి రికార్డు ఉందని తెలిపారు. ఆసియా కప్‌లోనూ టీంఇండియాకు సారథిగా వ్యవహరించి…
తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకిగ్స్ ప్రకటించింది. అయితే ఈసారి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానం నుండి ఏకంగా 8వ స్థానానికి వచేసాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత్ ప్రయాణం ముగిసిన విషయం తెలిసిందే. అయిన ఈ టోర్నీలోని చివరి మూడు మ్యాచ్ లలో అర్ధశతకాలతో రాణించిన భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండు స్థానాలను మెరుగుపరుచుకుని 8వ స్థానం నుండి 6వ స్థానానికి చేరుకున్నాడు. ఇక బౌలర్ల…