టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా 6 నెలలుగా క్రికెట్ కి దూరంగా ఉన్నాడు. ఆసియా కప్ 2022, టీ20వరల్డ్ కప్ 2022, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలు ఆడని జస్ప్రిత్ బుమ్రా.. ఐపీఎల్ 2023 సీజన్ తో పాటు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ సిప్ పైనల్ కి కూడా దూరమయ్యాడు. జస్ప్రిత్ బుమ్రా గాయం గురించి మొదటి నుంచి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. బుమ్రా త్వరలోనే కోలుకుని, టీ20 వరల్డ్ కప్ 2000 టోర్నీ ఆడతాడని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కామెంట్స్ చేశాడు. అయితే అలా జరగలేదు.. తాను ఫిట్ గా ఉన్నానని, ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని జస్ప్రిత్ బుమ్రా స్వయంగా ప్రకటించాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే జాతీయ క్రికెట్ అకాడమీ పెద్దలు మాత్రం జస్ప్రిత్ బుమ్రాని ఆడించి రిస్క్ చేయడం ఇష్టం లేక ఆపేస్తున్నారట.
Also Read : GVL Narasimha Rao: 2017లో టీడీపీ చేసిన తప్పే ఇప్పుడు వైసీపీ చేస్తోంది
దీనికి ప్రధాన కారణం దీపక్ చాహార్.. భారత ఆల్ రౌండర్ దీపక్ చాహార్ కూడా ఇదే విధంగా వెన్ను నొప్పితో బాధపడుతూ టీమ్ కి దూరమయ్యాడు. ఐపీఎల్ 2022 సీజన్ కి ముందు వెన్ను గాయంతో ఆటకు దూరమైన దీపక్ చాహార్, పూర్తిగా కోలుకుని తిరిగి ఆడడానికి ఆరు నెలల దాకా సమయం తీసుకున్నాడు.. బుమ్రా గాయపడడంతో దీపక్ చాహార్ ని ఆసియా కప్ 2022 టోర్నీలో ఆడించాలని అనుకుంది టీమిండియా. అయితే అది కూడా వర్కవుట్ కాలేదు. బుమ్రా గాయపడిన కొన్ని రోజులకే దీపక్ చాహార్ కూడా గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో అతను మళ్లీ ఆరు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2023 సీజన్ ద్వారా దీపక్ చాహార్ రీఎంట్రీ ఇస్తున్నాడు. జస్ప్రిత్ బుమ్రా గాయం దాదాపు ఒక్కటే రకం. అందుకే చాహార్ కి జరిగినట్టు, జస్ప్రిత్ బుమ్రా విషయంలో జరగకూడదని తెగ జాగ్రత్త పడుతుంది బీసీసీఐ. అందుకే జస్ప్రిత్ బుమ్రా ఫిటినెస్ గురించి ఎవ్వరికీ తెలియకుండా టాప్ సీక్రెట్ మెయింటైన్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది.
Also Read : IPL 2023 : అన్‌బాక్స్ ఈవెంట్ కోసం RCBలో చేరిన గేల్, AB డివిలియర్స్
బీసీసీఐలో ఉన్న చాలామందిక కూడా జస్ప్రిత్ బుమ్రా గాయం స్టేటస్ గురించి తెలీదు. కేవలం ఎస్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం బుమ్రాని స్పెషల్ గా పర్యవేక్షిస్తున్నాడు. బుమ్రాతో, ఫిజియోలతో మాట్లాడుతూ అతన్ని ట్రైయిన్ చేస్తున్నాడు. సెలక్షన్ కమిటీ సభ్యులకు కూడా బుమ్రా గాయం గురించి ఎలాంటి వివరాలు తెలీదు. టీమిండియా హెడ్ కోచ్ రాహెల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలకు కూడా జస్ప్రిత్ బుమ్రా గురించి ఎలాంటి విషయాలు తెలియకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజానికి అతను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు.. అయితే వెంటనే ఆడిస్తే మళ్లీ గాయపడే అవకాశాలు ఉన్నాయని ఉద్దేశంతో అతన్ని దాచి పెట్టి బీసీసీఐ మానిటర్ చేస్తోంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ గురించి కాకుండా, వచ్చే నాలుగైదు ఏళ్లు బుమ్రా భవిష్యత్ ని దృష్టిని పెట్టుకుని.. ఈ విధంగా చేస్తోందని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు.