బుధవారం జరిగిన ఐపీఎల్ 2023 ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ 81 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో ఆకాష్ మధ్వల్ పేరు మారిమ్రోగిపోయింది. 3.3 ఓవర్లలో 5 పరుగులిచ్చి 5 వికెట్లను తీసుకుని.. అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. కొన్నేళ్ల క్రితం ఇంజనీర్‌గా పని చేస్తూ టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతున్న మధ్వల్ ఇప్పుడు LSGకి వ్యతిరేకంగా తన అద్భుతమైన బౌలింగ్ తో IPL చరిత్ర పుస్తకాల్లోకి ప్రవేశించాడు. అతను ఇప్పుడు ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. MI యొక్క డ్రెస్సింగ్ రూమ్ వేడుకల సందర్భంగా, మాధ్వల్‌కు మ్యాచ్ బాల్‌ను బహుకరించారు. ఈ జ్ఞాపికను అందుకున్న తర్వాత అతను నవ్వుతూ ఉన్నాడు.
Also Read : TS POLYCET: నేడే టీఎస్ పాలిసెట్ ఫలితాలు
జస్ప్రీత్ బుమ్రా మరియు జోఫ్రా ఆర్చర్ ఇద్దరూ గాయపడటంతో.. టీమ్ లో ఆకాశ్ మధ్వల్ చోటు దక్కింది. అతను గత సంవత్సరం ముంబై ఇండియన్స్ టీమ్ లో చేరాడు, అయితే ఈ సీజన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అతన్ని పెద్ద వేదికకు పరిచయం చేయడానికి ముందు, ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటానికి మాత్రమే పరిమితమయ్యాడు. అయితే లక్నో తో జరిగిన మ్యాచ్ లో ఆకాశ్ మధ్వాల్ ను రోహిత్ తుది జట్టులోకి తీసుకున్నాడు. జట్టు నాకు బాధ్యతను అప్పగించింది కాబట్టి నేను దానిని చేయడానికి ప్రయత్నిస్తున్నాను” అని మాధ్వల్ తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శన తర్వాత విలేకరులతో అన్నారు.
Also Read : Lakshmi Stotra: మనస్సులో కోరికలు నెరవేలంటే ఈ స్తోత్ర పారాయణం చేయండి
నేను అతని (బుమ్రా) స్థానాన్ని తీసుకోగలనని కాదు.. కానీ నా సామర్థ్యంతో నేను చేయగలిగినదంతా చేస్తున్నాను అని మాధ్వల్ తెలిపాడు. క్రికెట్ అనేది నా ప్యాషన్, భారం కాదు అని అన్నాడు. కాబట్టి నేను ఇంజినీరింగ్‌ని వదిలిపెట్టి క్రికెట్ లోకి వచ్చినట్లు ఆకాశ్ మాధ్వల్ పేర్కొన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-37తో మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన ఇచ్చినందుకు కెప్టెన్ ( రోహిత్ శర్మ ) తనకు మరో ఛాన్స్ ఇచ్చాడని ఆకాశ్ మాధ్వల్ వెల్లడించారు. అయితే లక్నోతో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లు తీసుకున్న బంతిని ఆకాశ్ మాధ్వల్ కు ఇవ్వడంతో తాను సాధించిన విజయానికి గుర్తుగా దాచుకుంటానని ఇన్ స్టా గ్రామ్ లో వీడియోను పోస్ట్ చేశాడు. కాగా.. MI ఇప్పుడు క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేత ఆదివారం ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది.