ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టారు. గోదావరి జిల్లాలో పవన్ వారాహి యాత్ర కొనసాగుతోంది. అయితే, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం కాకినాడ నుంచి ముమ్మిడివరం వెళ్లనున్నారు.
పవన్ కళ్యాణ్ అనే వాడు నా నియోజకవర్గంలో మీటింగ్ పెట్టలేక రూరల్ లో మీటింగ్ పెట్టాడు అని ఆయన అన్నారు. రాజకీయ వ్యభిచారి మాటలకి నేను స్పందించాలి.. అస్సలు జనసేన పార్టీని ఎవరిని ఉద్ధరించడానికి పెట్టాడు అని పవన్ కల్యాణ్ ను ద్వారంపుడి ప్రశ్నించాడు. పవన్ కళ్యాణ్ ను నమ్మి వచ్చిన వారు ఎవరు ఉన్నారు.. నన్ను నమ్మిన వారు నాతోనే ఉన్నారు అని ఆయన అన్నారు.
కౌన్ కిస్కా గాళ్ల గురించి భయం ఉండదు.. కౌన్ కిస్కా గాళ్లను కౌన్ కిస్కా అనే అంటామన్నారు. నన్ను పాలించే ఎమ్మెల్యే క్రిమినల్ అయితే ఏమి చేయాలి.. సీఎం దోపిడిదారుడు అయితే ఏమి చేయాలని పవన్ అన్నారు. 2009 నుంచే రాజకీయాల్లో ఉంటే వైసీపీని రానివ్వకుండా చేసేవాన్నని తెలిపారు.