కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పిఠాపురం రావడం తాను చేసుకున్న అదృష్టమని.. దశాబ్ద కాలంగా మీ భవిషత్తు కోసం నిలబడ్డానని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
నేటి నుంచి వారాహి విజయయాత్ర చేపట్టనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నవరం సత్యదేవుని ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారాహి వాహనానికి పూజలు నిర్వహంచారు. సాయంత్రం అన్నవరం నుంచి కత్తిపూడి సభకు పవన్ వెళ్తారు.
Minister Merugu Nagarjuna: తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఏకమైనా.. బీజేపీ వారితో కలిసినా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మరోసారి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి మేరుగు నాగార్జున.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన దూకుడు గాళ్లు సీఎం రమేష్, సుజనా చౌదరి ఇచ్చిన స్క్రిప్ట్ ను బీజేపీ నేతలు చదువుతున్నారని.. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర…
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ, జనసేన ప్రస్తుతం పొత్తులో ఉన్నాయి.
చంద్రబాబు, అమిత్ షా భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని, అమిత్ షాను ఎవరైనా కలవచ్చని తెలిపారు. పొత్తులు అనేవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని, జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయని పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు.