Pawan Kalyan: జనసేనాని వారాహి యాత్ర విజయవంతంగా పూర్తిచేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. నేడు ముమ్మడివరంలో జనసేనాని మీటింగ్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఇక ఈ సభలో ఎక్కువగా పవన్ సినిమాల గురించే మాట్లాడారు. అందరు హీరోల అభిమానులను రైతులకు అండగా నిలబడమని కోరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ” నాకు మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ అందరి హీరోల అభిమానులకు విజ్ఞప్తి. నాకు వారందరూ ఇష్టమే, నేను వారి సినిమాలు చూస్తాను, మీరు వారిని అభిమానించండి. కానీ రైతులకు, ప్రజా సమస్యలకు కులం లేదు, నేను రాష్ట్రం కోసం పనిచేస్తున్నాను ఒక్కసారి అండగా నిలబడండి. మహేష్ గారు, ప్రభాస్ గారు నాకంటే పెద్ద హీరోలు. ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరో. వారు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు.
Yash 19: గీతూ మోహన్ దాస్ తో యష్ 19.. రామాయణ్ కూడా..
రామ్ చరణ్, ఎన్టీఆర్ గార్లు ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ అయ్యారు. నేను వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో తెలియకపోవచ్చు, కానీ వారు తెలుసు. ఇది ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి ఈగో లేదు. కులాల కోసం కొట్టుకోకండి. రాష్ట్ర క్షేమం కోసం అందరి హీరోల అభిమానులు నాకు, జనసేనకు అండగా నిలబడండి, మీ హీరోలను అభిమానించండి అని చెప్పుకొచ్చారు. ఇక తన ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవపడటం గురించి కూడా పవన్ మాట్లాడారు. కొంతమంది ఎన్టీఆర్ గారి అభిమానులు నా అభిమానులు సినిమా పరంగా గొడవలు పడుతున్నారు అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను. సినిమా వేరు రాజకీయం వేరు. రైతులకు కులం లేదు, ఆలోచించండి అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి పవన్ అడిగిన విధంగా అందరి హీరోల అభిమానులు పవన్ కు అండగా నిలబడతారేమో చూడాలి.
ప్రభాస్, @urstrulyMahesh, @alluarjun, @AlwaysRamCharan, @tarak9999 అందరూ నాకంటే పెద్ద హీరోలు..ప్యాన్ ఇండియా స్టార్లు, గ్లోబల్ స్టార్లు..
అయితే..
– ముమ్మిడివరంలో జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు#VarahiVijayYatra pic.twitter.com/M3rYQ9Ab0o
— JanaSena Party (@JanaSenaParty) June 21, 2023
కొంతమంది @tarak9999 గారి అభిమానులు నా అభిమానులు సినిమా పరంగా గొడవలు పడుతున్నారు అంటున్నారు. సినిమా వేరు రాజకీయం వేరు.
రైతులకు కులం లేదు, ఆలోచించండి – ముమ్మిడివరంలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.#VarahiVijayaYatra
— JanaSena Shatagni (@JSPShatagniTeam) June 21, 2023