Sarath Babu Passes Away: టాలీవుడ్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న( ఆదివారం) ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మృతి చెందగా.. నేడు(సోమవారం) సీనియర్ నటుడు శరత్ బాబు(71) కన్ను మూశారు.
రూ. 2వేల నోట్ల రద్దుపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందించారు. రూ. 2 వేల నోట్ల రద్దు వల్ల తనకు గానీ, వైసీపీ పార్టీకి కానీ ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వైసీపీ పార్టీ పేదల పక్షమన్నారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం ద్వారానే మేం ఎన్నికల్లో గెలుస్తాం.. డబ్బులతో కాదని ఆయన అన్నారు.
Somu Veerraju: గన్నవరంలో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.. ఛార్జ్ షీట్ కార్యక్రమం అమలుపై సమీక్ష జరుగుతోంది.. నేతల పనితీరుపై చర్చ ఉండగా.. పొత్తులపై పవన్ ప్రకటన, సొంత పార్టీ నేతల కామెంట్లపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.. అయితే, ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇవాళ పొత్తులపై చర్చ లేదు.. అధిష్టానానికి అన్నీ వివరించామని స్పష్టం చేశారు.. బీజేపీ, టీడీపీ, జనసేన…
Pawan Kalyan: సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తూ ట్విట్టర్ ద్వారా వరుస కౌంటర్లు వేశారు.. అన్నమయ్య డ్యాం విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ ట్వీట్ చేసిన పవన్.. క్లాస్ వార్ అంటూ జగన్ చేసిన కామెంట్ల మీద సెటైర్లు వేశారు.. అధికారికంగా రూ. 500 కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఉన్న రిచెస్ట్ సీఎం.. నిరంతరం కార్ల్ మార్క్స్ లా…
ఆరోగ్యశ్రీ బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ఇక్కట్ల పాలయ్యేది పేదలే అంటూ ఆయన అన్నారు. పేదలపై ప్రేమ ఉంటే బటన్ నొక్కి ఆరోగ్యశ్రీకి వెంటనే నిధులు ఇవ్వాలన్నారు. వైసీపీ పాలకులు ఆర్థిక నిర్వహణ వల్ల ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
Janasena: ఏపీలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది.