Pawan Kalyan: అభిమానం.. అది ఒక్కసారి మనసులో చేరితే ఎక్కడ వరకు అయినా తీసుకెళ్తోంది. చివరికి అభిమానించిన వ్యక్తి చెప్పినా కూడా వారి పిచ్చిని ఆపడం కష్టం. జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఎంతటి అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే అది అభిమానం కాదు భక్తి. వారు అభిమానులు కాదు భక్తులు అని చెప్పొచ్చు. అంతటి అభిమాన గళం ఆయనకు ఉంది. సినిమాలు, రాజకీయాలు అంటూ ఆయన రెండు పడవల మీద కాళ్ళు పెట్టి నడిచినా.. ఆయనకు తోడుగా జీవితాంతం ఉంటామని చెప్పుకొస్తారు. సోషల్ మీడియాలో పవన్ ను అనుకోకుండా కానీ, కావాలని కానీ విమర్శిస్తే వాళ్ళ అంతు చేసేవరకు వదలరు. పవన్ ను ఎవరు అన్నది అనేది కూడా చూడరు. కొన్నిరోజుల క్రితం పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ను కూడా అలాగే విమర్శించారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరు పవన్ ను నిందించారు. పిచ్చి ఫ్యాన్స్ ను పవన్ ఒక్క మాట చెప్పి కంట్రోల్ చేయవచ్చుగా అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. ఇక తాజాగా పవన్.. ఆ విషయమై స్పందించారు. తాజాగా ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురవ్వగా పవన్ మొదటిసారి సమాధానం చెప్పుకొచ్చాడు.
Bandla Ganesh : గురూజీ పై మరోసారి మండిపడిన బండ్ల గణేష్…
మీడియా మీ పార్టీపై నిర్మాణాత్మక విమర్శలు చేసినా మీ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. దీనిపై మీ అభిమానులకు ఏం చెబుతారు.. అన్న ప్రశ్నకు పవన్ మాట్లాడుతూ.. ” సోషల్ మీడియాలో ఎవరినీ కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. చివరకు నన్ను కూడా తిడుతున్నారు. ఆ మధ్య తానాకు వెళ్తానంటే తెగ తిట్టారు. తిడితే ఎంతమందిని ఆపగలం. నేను ఎవరినీ ప్రోత్సహించడం లేదు. చాలా సార్లు వద్దని చెప్పా. అలా చెప్పినందుకు నాకు కూడా ఎదురుతిరిగారు కొందరు. నామాట వినని వ్యక్తులు కూడా ఉన్నారు. మరికొందరు మిలిటెంట్ లా ఉన్నారు. కొందరు అభిమానులు మరీ తీవ్రతతో ఉన్నారు” అని చెప్పుకొచ్చాడు. అంటే సోషల్ మీడియాలో వచ్చే గొడవలను ఆపడానికి పవన్ తన వంతు ప్రయత్నం చేసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.