jammu kashmir DGP assassination: జమ్మూ కాశ్మీర్ లో దారుణం జరిగింది. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియాను దారుణంగా హత్య చేశారు. సోమవారం జమ్మూలోని అతని నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నారు. జమ్మూ శివార్లోని ఉదయ్ వాలా నివాసంలో గొంతు కోసి హత్య చేశారు. ఆ తరువాత తగలబెట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. శరీరంపై కాలిన గాయాలు ఉన్నాయి. అతని పనిపనిచే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.…
జమ్మూలో ఘోర ప్రమాదం జరిగింది. కట్రా నుంచి జమ్మూకు వెల్లే బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. బస్సులో మంటలు చెలరేగిన వెంటనే ఇద్దరు ప్రయాణికులు సజీవ దహనం కాగా… మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంజిన్ నుంచి మంటలు రావడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన కొద్ది సమయంలోనే…
ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని జమ్మూకాశ్మీర్‌లో భారత ప్రభుత్వం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్ వ్యాలీని జమ్మూతో అనుసంధానం చేసేందుకు ఈ రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. చినాబ్ నడిపై 1.3 కిలోమీటర్ల మేర 359 మీటర్ల ఎత్తులో రైల్వే బ్రిడ్జి ఉండబోతున్నది. ఫ్రాన్స్‌లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎక్కువ ఎత్తులో ఈ బ్రిడ్జి ఉంటుంది. ఈ బ్రిడ్జి కిందనుంచి మేఘాలు పాస్ అవుతున్న దృశ్యాలను రైల్వేశాఖ మంత్రి అశ్విన్ సోషల్ మీడియాలో…
2022లో మొదటి రోజే తీవ్ర విషాద ఘటన జరిగింది.. జమ్మూలోని వైష్ణో దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతిచెందారు.. ఈ తొక్కిసలాటలో మరో 13 మంది భక్తులు గాయపడినట్టుగా చెబుతున్నారు.. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని కత్రాలోని మాతా వైష్ణో దేవి మందిరంలో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఇవాళ తెల్లవారుజామున…
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నవేళ స్పైస్ జెట్ భారీ ఆఫర్‌ను ముందుకు తీసుకొచ్చింది. వావ్ వింటర్ సేల్ పేరుతో ఆఫర్‌ను ప్రకటించింది. డిసెంబర్ 27 నుంచి డిసెంబర్ 31 మధ్యకాలంలో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. చెన్నై-బెంగళూరు, బెంగళూరు-చెన్నై, హైదరాబాద్ -చెన్నై, జమ్మూ-శ్రీనగర్ మధ్య విమాన ప్రయాణం చేసే వారికి కేవలం రూ. 1122 తో టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. అన్ని చార్జీలను కలుపుకొని కేవలం రూ. 1122 చెల్లిస్తే సరిపోతుంది. Read: ఢిల్లీలో మరిన్ని ఆంక్షలు……
జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ నియోజక వర్గాలను పునర్విభజన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై అధికారులు కొన్ని ప్రతిపాదనలు చేశారు. జమ్మూలో 6, కాశ్మీర్‌లో 1 అసెంబ్లీ సిగ్మెంట్‌ను పెంచాలని పునర్విభజన సంఘం ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలపై కాశ్మీర్ పార్టీలు భగ్గుమన్నాయి. జమ్మూలో 6 సిగ్మెంట్లు పెంచాలనే నిర్ణయం బీజేపీకి లబ్ది చేకూర్చే విధంగా ఉందని, జమ్మూలో బీజేపీ బలంగా ఉందని, ఆ పార్టీకి లబ్ది చేయడం కోసమే ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నారని మండిపడ్డారు. జమ్మూతో పాటుగా…
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మళ్లీ మహమ్మారి పెరుగుతోంది… ఇక, జమ్ములోనూ రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పైకి కదులుతోంది.. దీంతో.. అప్రమత్తమైన అధికారులు కర్ఫ్యూ విధించారు… కరోనా కట్టడిలో భాగంగా.. ఇవాళ్టి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉటుందని.. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపారు..…
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా శ్రీనగర్‌లోని ఈద్గాం సంగం పాఠశాలపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు టీచర్లు మృతి చెందారు. ఇద్దరు ఉపాధ్యాయులకు పాయింట్ బ్లాక్ లో కాల్చడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు. మృతి చెందిన ఇద్దరు టీచర్లు సిక్కు, కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన సతీందర్ కౌర్, దీపక్ చాంద్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు, ఆర్మీ సంఘటనా స్థాలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదుల కోసం…
జమ్మూకాశ్మీర్ పర్యటనలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. జమ్మూకశ్మీర్‌తో మా కుటుంబానికి అనుబంధం ఉందన్న ఆయన.. తమ కుటుంబీకులు కూడా కశ్మీరీ పండిట్లేనని చెప్పారు.. ఇక్కడికి వచ్చి వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించినప్పుడు తన సొంతింటికి వచ్చినట్లు అనిపించిందన్నారు. ఇక, కొందరు కశ్మీరి పండిట్లు రాహుల్ గాంధీని కలిశారు. అయితే, వారి కోసం ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రవేశపెట్టిందని రాహుల్ గాంధీ. కశ్మీరీ పండిట్ సోదరులకు తన వంతు ఏదైనా సాయం చేస్తానని చెప్పారు.…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జమ్ము కాశ్మీర్ పర్యనటకు వెళ్లారు. ఇవాళ కటారాకు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత.. అక్కణ్నుంచి కాలినడకన వైష్ణో దేవి యాత్ర ప్రారంభించారు. దారి మధ్యలో భక్తులతో కాస్సేపు ముచ్చటించారు రాహుల్. మొత్తం 14 కిలోమీటర్ల దూరం కాలినడక వెళ్లారు రాహుల్.. అమ్మవారి దర్శించుకోవడానికే వచ్చినట్టు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వైష్ణోదేవి పరిసరాలకు చేరుకున్న రాహుల్ గాంధీ.. రేపు ఉదయం అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇది పూర్తిగా రాహుల్ వ్యక్తిగత యాత్రనీ పార్టీ వర్గాలు…