జమ్మూకాశ్మీర్ పర్యటనలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. జమ్మూకశ్మీర్‌తో మా కుటుంబానికి అనుబంధం ఉందన్న ఆయన.. తమ కుటుంబీకులు కూడా కశ్మీరీ పండిట్లేనని చెప్పారు.. ఇక్కడికి వచ్చి వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించినప్పుడు తన సొంతింటికి వచ్చినట్లు అనిపించిందన్నారు. ఇక, కొందరు కశ్మీరి పండిట్లు రాహుల్ గాంధీని కలిశారు. అయితే, వారి కోసం ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రవేశపెట్టిందని రాహుల్ గాంధీ. కశ్మీరీ పండిట్ సోదరులకు తన వంతు ఏదైనా సాయం చేస్తానని చెప్పారు.
జమ్మూలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. అక్కడి వారి చేత ‘జై మాతా ది’ అని నినాదాలు చేయించడం ఆసక్తి రేపింది. కాగా, గత నెల 10న ఖీర్ భవానీ దేవాలయంతోపాటు హజరత్ దర్గాను సందర్శించారు రాహుల్ గాంధీ. నెల రోజుల వ్యవధిలో రాహుల్ జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించడం ఇది రెండోసారి. జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంత హోదా తొలగించిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాహుల్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది..