ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని జమ్మూకాశ్మీర్‌లో భారత ప్రభుత్వం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్ వ్యాలీని జమ్మూతో అనుసంధానం చేసేందుకు ఈ రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. చినాబ్ నడిపై 1.3 కిలోమీటర్ల మేర 359 మీటర్ల ఎత్తులో రైల్వే బ్రిడ్జి ఉండబోతున్నది. ఫ్రాన్స్‌లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎక్కువ ఎత్తులో ఈ బ్రిడ్జి ఉంటుంది. ఈ బ్రిడ్జి కిందనుంచి మేఘాలు పాస్ అవుతున్న దృశ్యాలను రైల్వేశాఖ మంత్రి అశ్విన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Read: కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ల నిర్వహణపై ఉన్నత విద్యామండలి దృష్టి…
రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. అద్భుతమైన ఈ బిడ్జి నిర్మాణం కోసం టెక్లా సాఫ్ట్‌వేర్‌ను వినియోగించినట్టు పేర్కొన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తైతే ఉదంపూర్-శ్రీనరగ్- బారాముల్లాకు కనెక్టివిటి అవుతుందని అన్నారు. దీంతో జమ్మూ నుంచి కాశ్మీర్ వ్యాలీకి ప్రయాణం సుగమం అవుతుందని రైల్వేశాఖ పేర్కొన్నది. చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ రైల్వే బ్రిడ్జి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.