jammu kashmir DGP assassination: జమ్మూ కాశ్మీర్ లో దారుణం జరిగింది. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియాను దారుణంగా హత్య చేశారు. సోమవారం జమ్మూలోని అతని నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నారు. జమ్మూ శివార్లోని ఉదయ్ వాలా నివాసంలో గొంతు కోసి హత్య చేశారు. ఆ తరువాత తగలబెట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. శరీరంపై కాలిన గాయాలు ఉన్నాయి. అతని పనిపనిచే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యను అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హేమంత్ కుమార్ సొంతిళ్లు పునర్మిర్మాణంలో ఉండటంతో అని కుటుంబం స్నేహితుడు రాజీవ్ ఖజురియా ఇంట్లో ఉంటున్నారు.
Read Also: Bharat Jodo Yatra: 600 కిలోమీటర్ల పూర్తి చేసుకున్న రాహుల్ జోడో యాత్ర
హత్య జరిగినప్పటి నుంచి అతని సహాయకుడు కనిపించకుండా పోయాడు. ఇంటిలో పనిచేస్తున్న వ్యక్తిని యాసిర్ గా గుర్తించారు. అతడు రాంబన్ జిల్లాకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడి కోసం గాలిస్తున్నట్లు జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఏడీజీపీ) ముఖేష్ సింగ్ తెలిపారు. 57 ఏళ్ల లోహియా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ మాట్లాడుతూ.. హంతకుడు మొదట లోహియాను ఊపిరి ఆడకుండా చంపాడని.. గొంతు కోసేందుకు కెచప్ బాటిల్ ను పగటకొట్టి గొంతుకోశాడని.. తరువాత మృతదేహానికి తగలబెట్టేందుకు నిప్పటించే ప్రయత్నం చేశాడని అన్నారు. ఏడీజీపీ ముఖేష్ సింగ్ మాట్లాడుతూ.. నేరం జరిగిన ప్రదేశాన్ని చూసి అనుమానాస్పద మరణంగా కేసు బుక్ చేశామని.. పని మనిషి పరారీలో ఉన్నాడని.. అతని కోసం వేట ప్రారంభించామని చెప్పారు. ఫోరెన్సిక్ టీమ్, క్రైమ్ టీములు ఘటన స్థలానికి చేరుకుని.. ప్రాథమిక విచారణ ప్రారంభించాయని వెల్లడించారు. హేమంత్ లోహియా మరణం పట్ల పోలీసులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. దురదృష్ణమైన ఘటనగా పేర్కొన్నారు.