జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా శ్రీనగర్‌లోని ఈద్గాం సంగం పాఠశాలపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు టీచర్లు మృతి చెందారు. ఇద్దరు ఉపాధ్యాయులకు పాయింట్ బ్లాక్ లో కాల్చడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు. మృతి చెందిన ఇద్దరు టీచర్లు సిక్కు, కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన సతీందర్ కౌర్, దీపక్ చాంద్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు, ఆర్మీ సంఘటనా స్థాలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదుల కోసం ఆర్మీ సిబ్బంది ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పట్టపగలు స్కూళ్లోకి దూరి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొన్నది.
Read: గుడ్ న్యూస్: పిల్లల కోసం పూర్తిస్థాయి మలేరియా వ్యాక్సిన్..