పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులను ఒక మహిళ చూసినట్లు నివేదించడంతో జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో.. ముందుజాగ్రత్తగా జమ్మూలోని ఆర్మీ పాఠశాలలను శనివారం వరకు మూసివేయనున్నారు. భద్రతను నిర్ధారించడానికి కీలకమైన ఆర్మీ మరియు డిఫెన్స్ ఇన్‌స్టాలేషన్‌ల వద్ద భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. పంజాబ్ పోలీసులు వారిని వెతికి పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.
వివిధ శాఖలకు చెందిన నలుగురు ఉద్యోగులను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మంగళవారం తొలగించింది. వీరిలో ఇద్దరు పోలీస్ డిపార్ట్‌మెంట్ (కానిస్టేబుల్), ఒకరు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ (జూనియర్ అసిస్టెంట్), మరొకరు రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ డిపార్ట్‌మెంట్ (విలేజ్ లెవల్ వర్కర్) ఉద్యోగులు.
Amarnath Yatra : బాబా బర్ఫానీ దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు జమ్మూ కాశ్మీర్‌కు చేరుకుంటున్నారు. ఆదివారం నాటికి యాత్రికుల సంఖ్య మూడు లక్షలు దాటే అవకాశం ఉంది.
Amarnath Yatra : దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో కట్టుదిట్టమైన భద్రతలో అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. శనివారం 13,000 మంది భక్తులు బం బం భోలే నినాదంతో పవిత్ర గుహలో బాబా బర్ఫాని దర్శనం చేసుకున్నారు.
Jammu Kashmir: ఉత్తర కశ్మీర్‌లోని బందిపొర జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు వార్తలు రావడంతో భద్రతా బలగాలు ఈ చర్యలు చేపట్టాయి.
మంగళవారం సాయంత్రం కథువా జిల్లాలో సైదా గ్రామంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక జవాన్ అమరుడు కాగా, ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.
Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ అట్టుడుకుతోంది. వరసగా ఉగ్రవాద ఘటనలతో ఆ ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఆదివారం రియాసిలో బస్సుపై దాడి చేసిన ఘటనలో 10 మంది యాత్రికులు చనిపోయారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ కథువాలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ)కి సమీపంలో హీరానగర్ సెక్టార్‌లోని కథువాలోని సైదా గ్రామంలో ఇంటిపై ఉగ్రవాదులు దాడులు చేశారు.
Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఉత్తరప్రదేశ్ నుండి యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీని కారణంగా బస్సు కాలువలో పడిపోయింది.