ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నవేళ స్పైస్ జెట్ భారీ ఆఫర్‌ను ముందుకు తీసుకొచ్చింది. వావ్ వింటర్ సేల్ పేరుతో ఆఫర్‌ను ప్రకటించింది. డిసెంబర్ 27 నుంచి డిసెంబర్ 31 మధ్యకాలంలో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. చెన్నై-బెంగళూరు, బెంగళూరు-చెన్నై, హైదరాబాద్ -చెన్నై, జమ్మూ-శ్రీనగర్ మధ్య విమాన ప్రయాణం చేసే వారికి కేవలం రూ. 1122 తో టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. అన్ని చార్జీలను కలుపుకొని కేవలం రూ. 1122 చెల్లిస్తే సరిపోతుంది.
Read: ఢిల్లీలో మరిన్ని ఆంక్షలు… ప్రార్థనా మందిరాల్లోకి నో ఎంట్రీ…
జనవరి 15 నుంచి ఏప్రిల్ 15 మధ్యకాలంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ టికెట్లను స్పైస్ జెట్ వెబ్ సైట్, ఆన్ లైన్ ట్రావెల్ పోర్టల్స్, స్పైస్ జెట్ మొబైల్ యాప్, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చని స్పైస్ జెట్ తెలియజేసింది. ఒమిక్రాన్, కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న వేళ ఈ ఆఫర్ ను ఎంతవరకు వినియోగించుకుంటారో చూడాలి.