జమ్మూకశ్మీర్ ప్రస్తుతం యూనియన్ టెరిటరీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పరిస్థితి కొంతకాలం మాత్రమే ఉంటుందని, తప్పకుండా జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్రహోదా కల్పిస్తామని గతంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి నేతలకు హామీ ఇచ్చారు. అయితే, రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడిన తరువాత రాష్ట్రహోదాను ఇస్తామని చెప్పారు. దీనిపై మరోసారి రాజ్యసభలో కేంద్రహోంశాఖ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది. సరైన సమయంలో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని అన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత ఆ దిశగా…
జమ్మూకాశ్మీర్‌లో డ్రోన్‌లు కలకలం రేపుతున్నాయి. గత కొన్నిరోజులుగా పాక్ వైపు నుంచి భద్రతా బలగాల కళ్లుగప్పి ఇండియాలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కీలకమైన భద్రతాబలగాల స్ధావరాలు లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయి. దీంతో జమ్మూకాశ్మీర్ లో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఇక పాక్ బోర్డర్‌లో సెక్యూరిటీని పెంచారు. Read: అనాధాశ్రమంలో 16 మంది పిల్లలు మాయం… అయినప్పటికి భధ్రతా బలగాల కళ్లుగప్పి ఇండియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే,…
జమ్మూ ఎయిర్‌పోర్ట్‌లో జంట పేలుళ్లు జరిగాయి.. వెంటనే హైఅలర్ట్ ప్రకటించాయి భద్రతా దళాలు.. ఘటనా స్థలాన్ని ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జి టీమ్‌లో పరిశీలించాయి.. జమ్మూలోని వైమానిక దళం స్టేషన్‌లోని హై సెక్యూరిటీ జోన్‌లో ఇవాళ తెల్లవారుజామున రెండు పేలుళ్లు జరిగినట్టుగా చెబుతున్నారు.. అయితే, అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు.. ఎటువంటి నష్టం జరగలేదు.. ఆదివారం తెల్లవారుజామున ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగినట్టుగా చెబుతున్నారు.. మొదటి పేలుడు తెల్లవారుజామున 1:37 గంటలకు ఒక…
ఈ నెల 13వ తేదీన జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నట్టు వెల్లడించారు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి… జమ్మూలోని మజీన్ గ్రామం వద్ద ఆలయ నిర్మాణం జరగనుంది… రెండో దశలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేలా ఏర్పాటు చేస్తోంది టీటీడీ.. ఆలయంతో పాటు వేదపాఠశాల, యాత్రికులకు వసతి సముదాయం నిర్మాణం చేపట్టనున్నారు.. ఆలయ ప్రాంగణంలో కట్టడాలని రాతిని వినియోగిస్తామని తెలిపారు. కాగా, జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఇప్పటికే టీటీడీకి 62 ఎకరాల స్థలాన్ని కేటాయించింది…