Sanjay Raut: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ధ్వజమెత్తారు. బుధవారం రౌత్ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్లోని టెర్రర్ దాడులపై అమిత్ షాని టార్గెట్ చేశారు. అమిత్ షా ప్రతిపక్షాలను తుడిచిపెట్టే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు.
Pakistan: జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలో ఆదివారం టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారు. ఒక్కసారిగా బస్సులోయలో పడిపోయింది.
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో 30 ఏళ్ల తర్వాత చారిత్రక ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ముర్రాన్ గ్రామంలో తెరిచిన ఈ బరారీ మౌజ్ ఆలయంలో కాశ్మీరీ పండిట్లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముర్రాన్ గ్రామానికి చెందిన పండితులు, ముస్లిం ప్రజలు కలిసి ఆలయ తలుపులు తెరిచారు.
జమ్మూకశ్మీర్లో ప్రత్యేక హోదా రద్దు తర్వాత జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో ఆప్ కూటమి ఇండియా ఆధిక్యంలో ఉంది. జమ్మూ కాశ్మీర్లోని 5 స్థానాలకు గాను 4 స్థానాల్లో భారత కూటమి ఆధిక్యంలో ఉంది, ప్రారంభ ఆధిక్యత చూపిస్తుంది. ఎన్డీయేకు 1 సీటు వచ్చినట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి.
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో కాల్పులు కలకలం రేపాయి. జమ్మూకశ్మీర్లో ఈరోజు ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పుల్వామా జిల్లాలోని నిహామా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి పోలీసులకు సమాచారం అందడంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
India-Pakistan Border: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో కాశ్మీర్ వెంబడి నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్కి చైనా సైనిక మద్దతు అందిస్తోంది. గత కొంత కాలంగా సరిహద్దు వెంబడి అత్యాధునిక సౌకర్యాలను పాకిస్తాన్ పెంపొందించుకుంటోంది.
గత 35 ఏళ్ల తర్వాత ఈసారి లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. ఐదు లోక్సభ స్థానాలు ఉన్న మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల్లో కలిపి 58.46 శాతం ఓటింగ్ నమోదైందని పోల్ ప్యానెల్ పేర్కొంది. 2019తో పోల్చితే కశ్మీర్ లోయలో 30 శాతం భారీగా పెరిగిందని తెలిపింది. ఈ నిర్ణయం త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సానుకూలంగా ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్…
జమ్ముకాశ్మీర్లో జరుగుతున్న ఎన్నికల కార్యకలాపాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు (గురువారం) పరిశీలించనున్నారు. బారాముల్లా, అనంత్నాగ్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికలపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
Amit Shah: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) రగులుతోంది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం హోం మంత్రి అమిత్ షా బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు.