జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడుల నేపథ్యంలో భద్రతా పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంహెచ్‌ఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. రియాసిలో యాత్రికుల బస్సుపై దాడితో సహా పలు ఉగ్రవాద దాడులపై చర్చించారు. ఈ క్రమంలో.. అమిత్ షా జూన్ 16న షా ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితి, అమర్ నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ…
Terrorist Attacks: జమ్మూ కాశ్మీర్‌లో వరసగా జరుగుతున్న ఉగ్రవాద ఘటనలు ఆ రాష్ట్రంలో మరోసారి భయాందోళనల్ని పెంచాయి. గత ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజునే, ఉగ్రవాదులు రియాసి జిల్లాలో శివ్ ఖోరీ నుంచి కత్రాకు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై దాడి చేశారు.
కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాడ్డక జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నాలుగు రోజుల్లో 4 ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్ పరిస్థితులపై ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు.
Reasi Terror Attack: జమ్మూ కాశ్మీర్ రియాసీ జిల్లాలో ఆదివారం బస్సుపై ఉగ్రవాద దాడి ఘటనలో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌ని ఉద్దేశించి పాకిస్తాన్-చైనాలు చేసిన సంయుక్త ప్రకటనను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. లడఖ్‌తో సహా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అవిభాగాలని, విడదీయరాని ప్రాంతమని ఘాటుగా స్పందించింది.
గత నాలుగు రోజుల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య నాలుగు ఎన్కౌంటర్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితిని అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు.
Sanjay Raut: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ధ్వజమెత్తారు. బుధవారం రౌత్ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్‌లోని టెర్రర్ దాడులపై అమిత్ షాని టార్గెట్ చేశారు. అమిత్ షా ప్రతిపక్షాలను తుడిచిపెట్టే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు.
Pakistan: జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలో ఆదివారం టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారు. ఒక్కసారిగా బస్సులోయలో పడిపోయింది.