Jammu : జమ్మూకశ్మీర్‌లో ఆదివారం సాయంత్రం టవేరా వాహనం నదిలో బోల్తా పడిన ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు చనిపోగా.. ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Pakistan: భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పొలిటికల్ మైలేజ్ కోసం మా దేశాన్ని ఇందులోకి లాగొద్దని పాకిస్తాన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ శుక్రవారం అన్నారు.
పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ వాన కబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర భారత్‌కు చెందిన రాష్ట్రాల జాబితాను కేంద్ర వాతావరణ శాఖ విడుదల చేసింది.
Jammu Kashmir: సార్వత్రిక ఎన్నికల వేళ టెర్రరిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లో టార్గెటెడ్ కిల్లింగ్‌కి పాల్పడ్డాడు. బీహార్ నుంచి వచ్చిన వలస కూలీని లక్ష్యంగా చేసుకుని హతమార్చారు. ఈ ఘటన అనంత్ నాగ్ జిల్లాలో చోటు చేసుకుంది. బీహార్‌కి చెందిన వలసకూలిని చంపినట్లుగా బుధవారం అధికారులు తెలిపారు. మృతుడిని రాజు షాగా గుర్తించారు.
లోక్ సభ ఎన్నికల్లో నేపథ్యంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలలో చురుకుగా పాల్గొంటున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఓ కీలక హామీని ఇచ్చాడు. అతి త్వరలో జమ్మూ కాశ్మీర్ కొత్తగా రాష్ట్ర హోదా కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆ తర్వాత కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ఆయన చెప్పుకొచ్చాడు. Also Read: Rohit Sharma: కోహ్లీ రికార్డ్…
PM Modi: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదంపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు.
PoK: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK)పై కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే లోని ప్రజలే భారత్‌లో విలీనం కావాలనే డిమాండ్‌ని లేవనెత్తతున్నారని అన్నారు. పీఓకే భారత్‌లో విలీనం అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Pakistan: తీవ్ర ఆర్థిక సంక్షోభం, అప్పుల్లో కూరుకుపోయిన దాయాది దేశం పాకిస్తాన్, భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి చూస్తోంది. 2019లో జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ ఏకపక్షంగా భారత్‌తో వాణిజ్య, వ్యాపార సంబంధాలను నిలిపేసుకుంటున్నట్లు ప్రకటించింది.
జమ్మూకశ్మీర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ ఇవాళ(మార్చి 23) పర్యాటకుల కోసం తెరుచుకుంది. ఈసారి 17 లక్షల తులిప్ పూలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయని గార్డెన్ అధికారులు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలపై భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభ ఎన్నికలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన అనంతరం ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల గురించి తెలిపారు.