Reasi bus attack: రియాసిలో బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణను వేగవంతం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లా గండోహ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి దగ్గర నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇ
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య బుధవారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నాయి. దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయి. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజే ఉగ్రవాదులు యాత్రికులు బస్సుపై దాడికి తెగబడ్డారు. రియాసిలో జరిగిన ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వరస రోజుల్లో కథువా, దోడా జిల్లాల్లో ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఉత్తర కాశ్మీర్ బారాముల్లా జిల్లా ఉరీలోని గోహ్లాన్ ప్రాంతంలో ఉగ్రవాద చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఉరీ సెక్టార్లోని ఎల్ఓసి సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చినట్లు సమాచారం.
PM Modi: అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్ర హోదా జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎన్నో రోజుల నుంచి కోరుతున్న అంశాలు. ఈ అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆ రాష్ట్రంలో ప్రసంగించారు.
Chenab Railway Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైల్వే బ్రిడ్జ్ని నిర్మించి భారత్ రికార్డ్ సృష్టించింది. జమ్మూ కాశ్మీర్లో రైల్వే మార్గానికి ఎంతో కీలకమైన ‘‘చీనాబ్ రైల్వే వంతెన’’ పై నుంచి ఈ రోజు భారతీయ రైల్వే విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఇటీవల కాలంలో కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్న తరుణంలో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు ఈ రోజు మట్టుపెట్టాయి.
Jammu Kashmir: ఉత్తర కశ్మీర్లోని బందిపొర జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు వార్తలు రావడంతో భద్రతా బలగాలు ఈ చర్యలు చేపట్టాయి.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అన్ని విధాలా అంతమొందించాలని, రాబోయే అమర్నాథ్ యాత్రకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా బలగాలను ఆదేశించారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ డివిజన్లో ఉద్భవిస్తున్న ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, లోయలో దాని పునరుద్ధరణను నిరోధించాలని షా భద్రతా బలగాలకు సూచించారు.