Jammu Kashmir: పుల్వామాలో మూడు దశాబ్దాల తర్వాత తెరుచుకున్న ఆలయ తలుపులు
- ముర్రాన్ గ్రామంలో తెరుచుకున్నఈ బరారీ మౌజ్ ఆలయం తలుపులు
- హోమం నిర్వహించిన ముస్లిం-హిందువులు
- కాశ్మీరీ పండిట్ల ప్రత్యేక పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 30 ఏళ్ల తర్వాత చారిత్రక ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ముర్రాన్ గ్రామంలో తెరిచిన ఈ బరారీ మౌజ్ ఆలయంలో కాశ్మీరీ పండిట్లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముర్రాన్ గ్రామానికి చెందిన పండితులు, ముస్లిం ప్రజలు కలిసి ఆలయ తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు ప్రసాదం పంపిణీ చేశారు. అలాగే ఇరు వర్గాల ప్రజలు కలిసి హోమం చేశాయి. మూడు దశాబ్దాల తర్వాత బరారీ మౌజ్ ఆలయాన్ని తెరవడం పట్ల గ్రామంలోని వలసేతర పండితులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ సమయంలో కాశ్మీరీ పండిట్ మాట్లాడుతూ.. “మేం ఎప్పటికీ ఇక్కడి నుంచి వెళ్లిపోనట్లు భావిస్తున్నాం. మమ్మల్ని ఎప్పుడూ చూడని ముస్లిం యువకులు మమ్మల్ని వారి తల్లిదండ్రుల స్నేహితులుగా చూస్తున్నారు. వారితల్లిదండ్రుల కంటే మమ్మల్ని ఎక్కువగా గౌరవించారు. బరారీ మౌజ్
ఆలయంలో భజనలు పాడే బృందం ముస్లిం సమాజానికి చెందినది. వారు కాశ్మీరీ పండిట్ల కోసం భజనలు చేస్తున్నారు.”
READ MORE: Central Cabinet: కేంద్ర మంత్రుల్లో ఎంత మంది పట్టభద్రులు ఉన్నారో తెలుసా?
Also Read
- PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
భవిష్యత్తులో కూడా ఇలాంటి హోమాలు కొనసాగిస్తామని స్థానికులు తెలిపారు. కాగా.. పుల్వామా నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన వార్తలు వస్తుంటాయని విషయం మీకు తెలిసిందే. ఇది తీవ్రవాదుల కోటగా పరిగణించబడుతుంది. తాజాగా పుల్వామాలో రెండు పేలుడు పదార్థాలను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వీరితో పాటు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులను కూడా అరెస్టు చేశారు. ఆదివారం ఇక్కడ నుంచి సుమారు ఆరు కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, దానిని ధ్వంసం చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఇక్కడ హిందూ- ముస్లింలు కలిసి ఉండటం పూజలు చేయడం స్ఫూర్తిదాయకంగా పరిగణించవచ్చు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!