Sanjay Raut: అమిత్ షా మళ్లీ హోంమంత్రి కావడంతో దేశం ప్రమాదంలో పడింది..
- అమిత్ షా హోమంత్రి కావడం దేశానికి ప్రమాదం..
- జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడులకు బాధ్యత ఎవరిది..?
- ప్రతిపక్షాలను ఫినిష్ చేసే పనిలో షా..
- శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ధ్వజమెత్తారు. బుధవారం రౌత్ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్‌లోని టెర్రర్ దాడులపై అమిత్ షాని టార్గెట్ చేశారు. అమిత్ షా ప్రతిపక్షాలను తుడిచిపెట్టే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. షా హోంమంత్రిగా ఉన్న సమయంలోనే జమ్మూ కాశ్మీర్‌లో అత్యధిక సంఖ్యలో భద్రతా బలగాలు, పౌరులు మరణించారని ఆరోపించారు. ఢిల్లీలో మోడీ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలోనే 10 మంది మరణించారని, హోంమంత్రి తీవ్రవాదుల్ని నిర్మూలించే పని చేస్తే దేశానికి మేలు చేస్తుందని రౌత్ చెప్పారు.
Read Also: UP Crime: “నన్ను ప్రేమించి వేరేవాడితో అక్రమ సంబంధం”.. ప్రియురాలి తలనరికి దారుణ హత్య..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
బీహార్, ఏపీ ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడులు ఇద్దరూ అమిత్ షా రాజీనామా కోరాలని అన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై కూడా దాడి చేశారని, మోడీ ప్రభుత్వంలో మళ్లీ అమిత్ షా హోం మంత్రి కావడంతో దేశం ప్రమాదంలో పడిందని అన్నారు. దీనికి ముందు జమ్మూ కాశ్మీర్ దాడిపై ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ప్రాణాలు పోతున్నాయని, జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి బాధ్యులెవరని ఠాక్రే ప్రశ్నించారు. నేను దేశ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నానని, ఎన్డీయే ప్రభుత్వ భవిష్యత్ గురించి కాదని అన్నారు.
ఆదివారం జమ్మూకాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. మంగళవారం కథువా, దోడా ప్రాంతాల్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మరణించాడు. రియాసి ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలకు చెందిన 11 టీమ్‌లు గాలిస్తున్నాయి.
తాజావార్తలు
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!