Jammu-Kashmir Terror Attack :’పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించండి’.. మోడీ సూచన
- జమ్మూ కాశ్మీర్‌లో ముగిసిన సమీక్షా సమావేశం
- హోంమంత్రి అమిత్ షా..జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో మాట్లాడిన ప్రధాని
- ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నాలుగు రోజుల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య నాలుగు ఎన్‌కౌంటర్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితిని అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు. కేంద్రపాలిత ప్రాంతంలో శాంతిభద్రతలు, సాయుధ బలగాలు చేపడుతున్న ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల గురించి ప్రధానికి పూర్తి సమాచారం అందించారు. సాయుధ బలగాల తీవ్రవాద నిరోధక సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని ప్రధాని అధికారులకు సూచించారు. భారీ భద్రతా దళాలను మోహరించాలని తెలిపారు. భద్రతా బలగాల మోహరింపు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై ప్రధాని అమిత్ షాతో చర్చించినట్లు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ మనోజ్ సిన్హా తెలిపారు. గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా మాట్లాడిన ప్రధాని, కేంద్ర పాలిత ప్రాంతంలో పరిస్థితిని సమీక్షించారు. స్థానిక యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలను మనోజ్ సిన్హా ప్రధానికి తెలియజేశారు.
READ MORE: WhatsApp: 71 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సప్..ఎందుకో తెలుసా?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
బుధవారం జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో తాజా ఎన్‌కౌంటర్ జరిగింది, ఇందులో ఒక సైనికుడు గాయపడ్డాడు. గత నాలుగు రోజుల్లో దోడాలో ఇది రెండవ దాడి. కేంద్రపాలిత ప్రాంతంలో నాలుగో దాడి. జూన్ 9న రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసి తొమ్మిది మందిని హతమార్చారు. ఒక రోజు ముందు, దక్షిణాదిలోని కతువా ప్రాంతంలో భద్రతా బలగాలు మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. కాగా.. దోడాలోని ఎత్తైన ప్రాంతాల్లో ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు ఉన్నారని, సవాళ్లతో కూడిన భూభాగంలో వారిని మట్టుబెట్టేందుకు సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కొండ జిల్లాలోని భదర్‌వా-పఠాన్‌కోట్ రహదారిలోని చత్తర్‌గల్లా ఎగువ ప్రాంతంలోని జాయింట్ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు మంగళవారం రాత్రి దాడి చేయడంతో ఐదుగురు రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బంది, ఒక ప్రత్యేక పోలీసు అధికారి (SPO) గాయపడ్డారు. ముట్టడిని పటిష్టం చేసేందుకు అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పంపించారు. దోడాలో గత 24 గంటల్లో ఇది రెండో ఉగ్రవాద ఘటన కాగా, మూడు రోజుల్లో జమ్మూ కాశ్మీర్‌లో నాలుగో ఉగ్రవాద ఘటన.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..