JammuKashmir : కాశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భద్రతా బలగాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గత నాలుగు రోజులుగా దోడాలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సైనికులు గాలింపు చర్యలు చేపట్టారు.
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లా ప్రధాన కార్యాలయానికి 30 కిలోమీటర్ల దూరంలోని అడవులు, ఎత్తైన పర్వతాలతో చుట్టుముట్టబడిన దేసాలో సోమవారం సాయంత్రం 7.30 గంటలకు భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల తూటాలకు వీర జవాన్లు ధీటుగా సమాధానం చెప్పారు. కాగా.. ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ థాపా, సైనికుడు నాయక్ డి రాజేష్, కానిస్టేబుల్ బిజేంద్ర, అజయ్ సింగ్ గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.
భారత సైనికులు, జమ్ముకాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ముమ్మరం చేయగా ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు.. అందులో ఓ ఆర్మీ ఆఫీసర్ కూడా ఉన్నారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.
జమ్మూ కాశ్మీర్ కుప్వారాలోని కెరాన్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. ఈ సమయంలో భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
Earth Quake in Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో నేడు భూకంపం సంభవించింది. కాశ్మీర్ లోని బారాముల్లాలో ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రకంపనలు రావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. దింతో వారు రోడ్లపైకి పరుగులు తీశారు. ఇకపోతే, ఈరోజు మధ్యాహ్నం 12:25 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంపం తర్వాత బారాముల్లాలో ప్రజలలో గందరగోళం నెలకొంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండడంతో…
Mother Slits Throats Of Twins: తాను తల్లినని మరిచి ఓ మహిళ రాక్షసిలా ప్రవర్తించింది. నవజాత శిశువుల గొంతు కోసి చంపింది. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో జరిగింది.
Terrorist Yasin Malik: కాశ్మీర్ వేర్పాటువాది, ఉగ్రవాది యాసిన్ మాలిక్కి మరణశిక్ష విధించాలని కోరుతూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఢిల్లీ హైకోర్టలో అప్పీల్ చేసింది. అయితే, ఈ దర్యాప్తు నుంచి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ శర్మ గురువారం తప్పుకున్నారు.
Kathua Ambush: సోమవారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ అధికారులు మరణించారు. జమ్మూ లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులు నక్కి, ఆర్మీ వాహనంపై దాడికి పాల్పడ్డారు. ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించిన ఘటనకు ప్రతీకారం తప్పకుండా తీర్చుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర అరమనే ఈ రోజు అన్నారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల కాలంలో జరుగుతున్న ఉగ్రదాడుల వెనక లష్కరే తోయిబా, ది రిసిస్టెన్స్ ఫ్రంట్కి చెందిన ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లుగా భద్రతా వర్గాలు తెల్చాయి.