Encounter in Doda: దేశ సరిహద్దులో భారత ఆర్మీ 24 గంటల పాటు పహారా కాస్తున్నా టెర్రరిస్టుల చొరబాట్లు ఏమాత్రం ఆగడం లేదు.. దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు నిరంతరం ప్రయత్నిస్తునే ఉన్నారు. అడ్డంగా దొరికిపోయిన ఉగ్రమూకలు ఏమాత్రం వెనుకాడకుండా భారత సైన్యంపై కాల్పులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే జమ్ము కాశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో నిన్న (సోమవారం) అర్థరాత్రి దాటాక భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. టెర్రరిస్టులు సంచరిస్తున్నారనే ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు దేసా అడవుల్లో ఇండియన్ ఆర్మీ, జమ్ముకాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ కొనసాగించారు. టెర్రరిస్ట్‌ల ఏరివేతకు అదనపు బలగాలను భారీగా మోహరించారు.
Read Also: Guntur Crime: వేధింపులతో బాలిక ఆత్మహత్య.. భయంతో యువకుడి ఆత్మహత్యాయత్నం..
అయితే, ఈ క్రమంలోనే గాలింపు చర్యలను భారత సైనికులు, జమ్ముకాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ముమ్మరం చేయగా ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు.. అందులో ఓ ఆర్మీ ఆఫీసర్ కూడా ఉన్నారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. కాగా, టెర్రరిస్టులు, ఇండియన్ సైనికులకి మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే, దోడా ప్రాంతంలో గత 35 రోజుల్లో ఇది నాలుగో ఎన్‌కౌంటర్ అని స్థానిక పోలీసులు ప్రకటించారు.