జమ్మూ కాశ్మీర్ కుప్వారాలోని కెరాన్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. ఈ సమయంలో భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సమాచారం. చొరబాటుదారుల బృందాన్ని ఆపడానికి సైన్యం ప్రయత్నించింది. ఆ తర్వాత కాల్పులు ప్రారంభమయ్యాయి. చొరబాటుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. గురువారం తెల్లవారుజామున కూడా జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. అనుమానిత ఉగ్రవాదుల బృందం భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. సైన్యం అడ్డుకోవడంతో తిరిగి వెనుకకు పారిపోయారు.
READ MORE:Popcorn : పాప్కార్న్ను తెగ లాగిచేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..
కాగా.. సోమవారం కతువాలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై గ్రెనేడ్‌తో దాడి చేశారు. ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. దీని తర్వాత సైన్యం మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ సందర్భంగా భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కూడా జరిగాయి. దాడి తర్వాత, సైనిక వాహనం యొక్క చిత్రం కూడా స్పాట్ నుంచి బయటకు వచ్చింది. దాడి తర్వాత.. లోయలో సైన్యం మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. కొండపై దాక్కున్న ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారని, ఆర్మీ వాహనంపై గ్రెనేడ్ కూడా విసిరారని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత కొద్ది రోజులుగా లోయలో అలజడి పెరిగింది. ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయనే వార్తలు వరుసగా వస్తున్నాయి.