జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ నియోజక వర్గాలను పునర్విభజన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై అధికారులు కొన్ని ప్రతిపాదనలు చేశారు. జమ్మూలో 6, కాశ్మీర్‌లో 1 అసెంబ్లీ సిగ్మెంట్‌ను పెంచాలని పునర్విభజన సంఘం ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలపై కాశ్మీర్ పార్టీలు భగ్గుమన్నాయి. జమ్మూలో 6 సిగ్మెంట్లు పెంచాలనే నిర్ణయం బీజేపీకి లబ్ది చేకూర్చే విధంగా ఉందని, జమ్మూలో బీజేపీ బలంగా ఉందని, ఆ పార్టీకి లబ్ది చేయడం కోసమే ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నారని మండిపడ్డారు. జమ్మూతో పాటుగా…
కాశ్మీర్ లో మరోసారి ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదాలు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంతో భద్రతా బలగాలు గాలింపు చేస్తున్న సమయంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు శ్రీనగర్ శివార్లలోని హర్వాన్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుందని… ఇందులో ఒక ఉగ్రవాదిని హతమార్చామని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.…
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. రాజధాని శ్రీనగర్ శివారులోని పోలీస్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి. గామపడిని పోలీసులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు పోలీస్ క్యాంప్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా గాలింపుచర్యలు చేపట్టారు. Read: వైరల్:…
జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ను పునరుద్ధరించాలంటే కాంగ్రెస్ వల్ల అయ్యే పని కాదని .. ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 300 స్థానాల్లో గెలుపొందాలని, అది అసాధ్యమని అన్నారు. అధికరణ 370 రద్దుపై తన మౌనం గురించి జమ్మూ-కాశ్మీరులోని పూంఛ్ జిల్లా, కృష్ణఘాటి ఏరియాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, దీనిని కేవలం సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలవని ఆయన పేర్కొన్నారు. ‘మేము సొంతంగా…
ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది కూడా సైనికులతో కలిసే దీపావళి పండగ జరుపుకోనున్నారు. గత ఏడాది రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని లోంగేవాలా సరిహద్దు వద్ద సైనికులతో కలిసి దీపాలు వెలిగించారు. ఈ సారి ఆయన జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఇవాళ నౌషేరా, రాజౌరీ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లనున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 2019లో కూడా రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద బాధ్యతలు నిర్వర్తిస్తోన్న జవాన్లతో పండగ జరుపుకొన్నారు.
ఇటీవల జమ్మూకాశ్మీర్ జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, జేసీవో వీరమరణ పొందారు. దీంతో జవాన్ల వీరమరణం ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల స్థావరం కోసం పోలీసులు గాలిస్తుండగా పూంచ్ జిల్లా మెంధార్ వద్ద ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు తెగబడ్డారు. లష్కరే తొయిబా ఉగ్రవాది జియా ముస్తఫాను ఘటనా స్థలికి తీసుకెళ్లిన పోలీసులు.. కాల్పుల వేళ ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం గుర్తింపుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు పాల్పడడంతో సీఆర్‌పీఎఫ్…
మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేటి నుంచి జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఇక్కడ పౌరులే టార్గెట్ గా ఉగ్ర దాడులు జరుగుతున్న తరుణంలో పంచాయతీ సభ్యులు, రాజకీయ కార్యకర్తలతో సమావేశమవుతారు. అలాగే, కేంద్ర బలగాలతో సమావేశమై భద్రతపై సమీక్షిస్తారు.ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత షా తొలిసారి ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈ నెలలో ఇక్కడ జరిగిన దాడుల్లో 11 మంది పౌరులు మరణించారు. ఈ ఘటనలతో సంబంధం ఉన్న…
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య హైఓల్డేజ్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. రెండు దేశాల్లోనూ భావోద్వేగాలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే దాయాదితో మ్యాచ్ పై రాజకీయ మేఘాలు ముసురుకుంటున్నాయి. కశ్మీర్లో మనుషుల్ని చంపుతున్న పాకిస్తాన్ తో క్రికెట్ ఏంటనే వాదన తెరపైకి వచ్చింది. అయితే క్రీడల్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని మరో వర్గం వాదిస్తోంది. మ్యాచ్ ఆడకపోతే భారత్ కు లాభమా.. నష్టమా..? దాయాదుల మధ్య పోరుకు క్రేజ్ ఏ రేంజ్…