సాధారణంగా ఇగ్లూ అనగానే మనకు దృవప్రాంతాలు గుర్తుకు వస్తాయి. అక్కడి ప్రజలు మంచుతోనే చిన్నచిన్న ఇల్లు కట్టుకొని జీవనం సాగిస్తుంటారు. ఇగ్లూ హౌస్ మోడల్‌లోనే ఇగ్లూ కేఫ్‌ను జమ్మూకాశ్మీర్‌లో ఏర్పాటు చేశారు. 37.5 అడుగుల ఎత్తు, 44.5 అడుగుల వ్యాసార్థం ఉన్న ఈ ఇగ్లూ కేఫ్ గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లోకి ఎక్కింది. జమ్మూకాశ్మీర్‌లోని గుల్మర్గ్ లో ఈ కేఫ్‌ను నిర్మించారు. ఈ కేఫ్ నిర్మాణం 64 రోజుల్లో పూర్తయినట్టు నిర్వహకులు తెలిపారు. 25 మంది వర్కర్లు 1700 పనిగంటలు పనిచేసి ఈ ఇగ్లూ కేఫ్ ను రూపోందించారు. ఈ కేఫ్‌లో మొత్తం 10 టెబుళ్లను ఏర్పాటు చేశారు.
Read: Glass Bridges: పర్యాటకులను ఆకట్టుకుంటున్నగ్లాస్ వంతెనలు…
ఒకేసారి 40 మంది కూర్చొని భోజనం చేసేందుకు వీలు ఉంటుందని నిర్వహకులు చెబుతున్నారు. ఈ ఇగ్లూ కేఫ్ గోడలు 5 అడుగుల మందంతో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మార్చి 15 వరకు ఈ ఇగ్లూ కేఫ్ ఓపెన్‌లో ఉంటుందని, మార్చి 15 తరువాత కష్టమర్లకు అనుమతి ఉండదని నిర్వహకులు పేర్కొన్నారు. న్యూజిలాండ్‌లో ఈ తరహా ఇగ్లూకేఫ్ ను చూసిన తరువాత వచ్చిన ఆలోచనతో జమ్మూకాశ్మీర్‌లోని గుల్మార్గ్ లో ఈ కేఫ్‌ను ఓపెన్ చేసినట్లు నిర్వహకులు తెలియజేశారు.