Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు జవాన్లు మరణించడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. వారికి నివాళులు అర్పించిన రాహుల్, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Rajnath Singh: జమ్మూ కాశ్మీర్‌లోని కతువా జిల్లా మచెడి ప్రాంతంలో ఆర్మీ ట్రక్కుపై సోమవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా ఐదుగురు జవాన్లు మరణించాగా.. మరో ఐదుగురు గాయపడడంతో వారిని పఠాన్‌కోట్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు.
జమ్మూలోని కథువాలో ఆర్మీ జవాన్లపై ఉగ్రదాడి జరిగిందన్న పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ జరిగిన ఉగ్రదాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. సోమవారం సాయంత్రం ఈ దాడి వార్త వెలుగులోకి వచ్చింది.
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీని సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి జమ్మూ డివిజన్‌తో పాటు లోయ, ఢిల్లీలో తీవ్ర రాజకీయ కార్యకలాపాలు సాగుతున్నాయి.
జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో సోమవారం ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు కొండపై నుండి ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారు. అంతేకాకుండా.. గ్రెనేడ్లు కూడా విసిరారని అధికారులు తెలిపారు. కాగా.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. గత నెల జూన్ 11, 12 తేదీల్లో జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రదాడులతో దద్దరిల్లింది.
కేంద్ర ఆరోగ్య మంత్రి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం రెండవ రోజు జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ నేతలు పార్టీ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరని..ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు.
దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా చినిగామ్‌లో భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను వీరమరణం పొందారు.
పాకిస్థాన్, చైనాలు కలిసి ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న పాక్ ఆర్మీకి ఇప్పుడు చైనా నుంచి సాయం అందుతోంది.