హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటైన అమర్‌నాథ్ గుహలో శనివారం 'మొదటి పూజ' జరిగింది. శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) చైర్మన్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన అధికారిక పోస్ట్‌లో పోస్ట్ చేశారు.
PM Modi Kashmir Visit: నేడు ( గురువారం) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జమ్మూ అండ్ కశ్మీర్ లో పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీనగర్‌లోని షేర్-ఇ-కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో ‘ఎంపవరింగ్ యూత్, ట్రాన్స్‌ఫార్మింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు.
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో.. వెంటనే అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
Kishan Reddy : కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి సోమవారం జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇంఛార్జిగా నియమితులయ్యారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ తో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా పార్టీ ఎన్నికల ఇంచార్జ్‌లు, కో – ఇన్‌చార్జ్ లను నియమించారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, జమ్మూ కాశ్మీర్‌లో సెప్టెంబర్ లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఎన్నికల…
జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు తలదాచుకుంటూ అక్కడి నుంచి వారు తమ స్థానిక నెట్‌వర్క్‌ల ద్వారా బారాముల్లా, కుప్వారాతో సహా లోయలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
పాకిస్థాన్‌తో చర్చలు జరిగే వరకు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతం కాదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా బుధవారం అన్నారు. గత మూడు రోజుల్లో జమ్మూలో జరిగిన మూడు ఉగ్రవాద దాడుల తర్వాత అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు తరచూ దాడులకు దిగుతున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని దోడాలో గల ఆర్మీ పోస్ట్‌పై మంగళవారం అర్థరాత్రి ఉగ్రమూకలు దాడి చేశాయి. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు చెప్పారు.
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఎన్‌కౌంటర్ జరిగింది. సోమవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో మరణించిన ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని.. వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈరోజు తెల్లవారుజామున పాకిస్తాన్ లష్కరే తోయిబాకు చెందిన.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు కమాండర్లు, వారు రహస్య ప్రదేశంలో ఓ ఇంటిలో తలదాచుకున్నట్లు సమాచారం అందిందని భద్రతా అధికారులు తెలిపారు.
Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా, పూంచ్ జిల్లాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న భద్రతా దళాలు శనివారం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.