భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో ఖలీస్తానీ ఉగ్రవాది దాడికి యత్నించాడు. అంతేకాకుండా భారత జాతీయ జెండాను చించేసి పడేశాడు. దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఖలీస్తానీ ఆందోళనకారులను చెదరగొట్టారు. అయితే ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిచింది.
ఇది కూడా చదవండి: Kiran Royal: క్లీన్ చిట్‌తో మళ్లీ నేషనల్ హైవేలా దుసుకుపోతా!
విదేశాంగ మంత్రి జైశంకర్ యూకే పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రతా ఉల్లంఘన దృశ్యాలను తాము చూసినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వేర్పాటువాదులు, తీవ్రవాదుల దుశ్చర్యలను, ప్రజాస్వామ్య స్వేచ్ఛ దుర్వినియోగం కావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో ఆతిథ్య దేశం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Akhil : అయ్యగారి సినిమా అప్డేట్ ఎప్పుడు ఇస్తారో?
లండన్‌లోని ఛాఠమ్ హౌస్‌లో పలు అధికారిక సమావేశాలు ముగించుకుని జైశంకర్ బయటకు వచ్చినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఖలీస్తానీ అనుకూల వ్యక్తులు ఆందోళన చేపట్టారు. తమ జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జైశంకర్ కారును అడ్డుకున్నారు. అప్రమత్తమైన లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంగళవారం (మార్చి 4) జైశంకర్ యూకే పర్యటనకు వెళ్లారు. ఈనెల 9వ తేదీ వరకు లండన్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బ్రిటన్ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్యలు జరిపారు. వివిధ అంశాలపై ఇరువు చర్చించారు. ఇక యూకే పర్యటన తర్వాత జైశంకర్ ఐర్లాండ్‌కు వెళ్లనున్నారు.
ఇది కూడా చదవండి: Cyber Crime: హైదరాబాద్లో వెలుగు చూసిన కాల్ సెంటర్ స్కాం..