భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో ఉగ్ర కలకలం చోటుచేసుకుంది. ఖలీస్తానీ ఉగ్రవాదులు.. జైశంకర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. భారతీయ జెండాను చించేసి నానా హంగామా సృష్టించారు. దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు.. ఖలీస్తానీ ఉగ్రవాదితో పాటు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లండన్‌లోని ఛాఠమ్ హౌస్‌లో పలు అధికారిక సమావేశాలు ముగించుకుని జైశంకర్ బయటకు వచ్చినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Crime News: హైదరాబాద్లో దారుణం.. కర్రతో కొట్టి చంపిన స్నేహితుడు
మంగళవారం (మార్చి 4) జైశంకర్ యూకే పర్యటనకు వెళ్లారు. ఈనెల 9వ తేదీ వరకు లండన్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బ్రిటన్ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్యలు జరిపారు. వివిధ అంశాలపై ఇరువు చర్చించారు. అనంతరం ‘ప్రపంచంలో భారతదేశ వృద్ధి.. పాత్ర’ అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైశంకర్ ప్రసంగించారు. ఇక యూకే పర్యటన తర్వాత జైశంకర్ ఐర్లాండ్‌కు వెళ్లనున్నారు.
ఇది కూడా చదవండి: AP Assembly Sessions 2025: వాడివేడిగా కొనసాగుతున్న శాసనమండలి సమావేశాలు.. నేడు చర్చించే అంశాలు ఇవే!
#WATCH | London, UK | Pro-Khalistan supporters staged a protest outside the venue where EAM Dr S Jaishankar participated in a discussion held by Chatham House pic.twitter.com/ISVMZa3DdT
— ANI (@ANI) March 6, 2025