India Canada Row: భారతపై వ్యతిరేకతను కెనడా సర్కార్ బహిరంగంగా ప్రదర్శిస్తోంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలహీనపడుతున్నా కూడా లెక్క చేయడం లేదు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా మీడియా సంస్థ అయిన ఆస్ట్రేలియా టుడేపై కెనడా ఆంక్షలు విధించింది. కెనడాలో ఆ సంస్థ ప్రసారాలు, వార్తలు ప్రజలకు చేయకుండా బ్లాక్ చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే, మరికొన్ని సోషల్ మీడియా ఖాతాలపైనా నిషేధం విధిస్తున్నట్లు కేనడా ప్రభుత్వం తెలిపింది.
Read Also: Savings Account In Bank: సేవింగ్స్ అకౌంట్లో పరిమితికి మించి నగదు డిపాజిట్ చేస్తే ఐటీ నోటీసు షురూ
కాగా, తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మీడియా సమావేశాన్ని ప్రసారం చేయడమే ఇందుకు కారణంగా చెప్పుకొచ్చింది. కెనడా ప్రభుత్వ చర్యపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా ఉందో ఈ ఘటనతో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛను గౌరవిస్తున్నామని సుద్దులు చెప్పే కెనడా సర్కార్ ఆచరణలో ఆందుకు విరుద్ధంగా పని చేస్తోందని విమర్శలు గుప్పించారు. భారత్‌పై కెనడా చేస్తున్న అసంబద్ధ ఆరోపణలను ఆస్ట్రేలియా గడ్డపై జైశంకర్ ఎండగట్టడాన్ని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం సహించలేకపోతోందని రణధీర్ జైస్వాల్ ఆరోపించారు.