Jai shankar: భారత్ ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తుంది.. విదేశాంగ మంత్రి పోస్ట్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jai shankar: భారత్–పాకిస్తాన్ మధ్య గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉద్రిక్తతల తరువాత, ఈరోజు భారత్ పూర్తి, తక్షణ కాల్పుల విరమణ ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన అనంతరం దేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సోషల్ మీడియా వేదికగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. జైశంకర్ తన ట్వీట్‌లో.. “భారత్ ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా నిర్దాక్షిణ్యంగా వ్యతిరేకిస్తుంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఈరోజు ఒక అవగాహనకు వచ్చాయి. రెండు దేశాలూ ఇకపై కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ చర్య భూమి, వాయు, సముద్ర మార్గాలన్నింటికి వర్తించనుంది. ఇది ఒక శాంతియుత చర్యగా భావించవచ్చు. అయితే, ఉగ్రవాదంపై భారత్ వైఖరి మాత్రం స్పష్టమైనదిగా ఉంది. ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా, దాని వ్యక్తీకరణ ఏ విధంగా ఉన్నా భారతదేశం దానికి సమాధానం ఇస్తుందని” పేర్కొన్నారు.
Read Also: India- Pakistan: పాకిస్థాన్ ఎన్నిసార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘించిందో తెలుసా?
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఈ పరిణామాల నేపథ్యంలో, శాంతి దిశగా అడుగులు పడుతున్నప్పటికీ, జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని స్పష్టమవుతోంది. ఇక విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. భారతదేశం, పాకిస్తాన్ మధ్య మిలిటరీ ఆపరేషన్ల డైరెక్టర్లు మధ్య మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగిన కాల్‌లో, భూమి, వాయు, సముద్ర మార్గాల్లో జరిగిన అన్ని మిలిటరీ చర్యలను తక్షణంగా ఆపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి అమలులోకి వస్తుందని అన్నారు. ఈ కాల్పుల విరమణ ప్రకటనకు ముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా ఈ వార్తను ముందుగా ప్రకటించారు. ఆయన ప్రకటనలో అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ విరమణ ఒప్పందం సాధ్యమైందని పేర్కొన్నారు.
India and Pakistan have today worked out an understanding on stoppage of firing and military action.
India has consistently maintained a firm and uncompromising stance against terrorism in all its forms and manifestations. It will continue to do so.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 10, 2025
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!