Bihar Politics: నితీష్ వైఖరిపై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Politics: బీహార్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాకూటమి సర్కార్ పడిపోయింది. గత వారం రోజులుగా చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ ముఖ్యమంత్రి పదవికి ఆదివారం ఉదయం నితీష్ రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. ఈ సాయంత్రం 7 గంటలకు మరోసారి బీజేపీ మద్దతుతో తొమ్మిదోసారి సీఎంగా నితీష్‌కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇదిలా ఉంటే నితీష్‌కుమార్ వైఖరిపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. తరచూ రాజకీయ భాగస్వాములను మార్చడం నితీశ్ కుమార్‌కు అలవాటేనని.. రంగులు మార్చడంలో ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని కాంగ్రెస్ ఘాటుగా వ్యాఖ్యానించింది. బీహార్ ప్రజలు నితీష్‌ను ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోరని కాంగ్రెస్ సీనియర్ జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రను చూసి ప్రధాని మోడీ, బీజేపీ భయపడుతుందన్నారు. దీన్ని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ ఈ గందరగోళానికి తెరలేపిందని ఆరోపించారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Read Also: Minister Peddireddy: చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్
నితీష్ రాజీనామా వ్యవహారం తమకు ముందే తెలుసని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గే తెలిపారు. ఈ విషయాన్ని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ముందుగానే తెలియజేశారని చెప్పుకొచ్చారు. కానీ ఇండియా కూటమి ఐక్యత దెబ్బ తింటుందన్న భావనతో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరించారు. నీతీశ్ లాంటి ‘ఆయా రామ్.. గయా రామ్’ మనుషులు దేశంలో చాలా మంది ఉంటారని ఖర్గే ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!