కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభను తప్పుదారి పట్టించారని కాంగ్రెస్ చీఫ్ విప్ జైరామ్ రమేశ్ ఆరోపించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం కిరణ్ రిజిజుపై హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభ పనితీరుకు సంబంధించిన 188వ నిబంధన కింద రమేష్ ఈ నోటీసు ఇచ్చారు. ఆ నోటీసులో.. రిజిజు చేసిన తప్పుడు ప్రకటనలను ప్రస్తావిస్తూ, శివకుమార్ చేసిన వ్యాఖ్యలను అబద్ధం అని ఖండించారు. రిజిజు చేసిన వ్యాఖ్యలు తప్పుదారి పట్టించే ప్రకటనలు అని పేర్కొన్నారు. ఇది ప్రత్యేక హక్కుల ఉల్లంఘన, సభ ధిక్కారానికి సమానం అని జైరాం రమేష్ నోటీసులో తెలిపారు. అలాగే.. సభలో తప్పుడు, తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయడం హక్కుల ఉల్లంఘన మరియు సభ ధిక్కారమే” అని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నోటీసును రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్‌కు జైరామ్ రమేష్ రాశారు. తప్పుడు వ్యాఖ్యలు చేసిన రిజిజుపై ప్రత్యేక హక్కుల చర్యలు ప్రారంభించాలని ఆయన అభ్యర్థించారు.
Read Also: Tamarind Seeds: చింతగింజల గురించి తెలిస్తే ఇకపై ఒక్కటి కూడా పడేయకుండా భద్రపరుస్తారంతే!
రిజిజు చేసిన వ్యాఖ్యలు
అంతకుముందు.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో మాట్లాడుతూ, “రాజ్యాంగ పదవిలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు.. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి తమ పార్టీ రాజ్యాంగాన్ని సవరిస్తామని చెప్పారు” కిరణ్ రిజిజు రాజ్యసభలో అన్నారు. అయితే.. ఆ నాయకుడి పేరును వెల్లడించనప్పటికీ.. డీకే శివకుమార్ పై పరోక్షంగా సూచించడమే ఆయన ఉద్దేశం అని కొంతమంది భావిస్తున్నారు. ఇలాంటి ప్రకటనలను మనం తేలికగా తీసుకోలేమని రిజిజు అన్నారు. ఈ వ్యాఖ్యలు ఒక సాధారణ నాయకుడు చేయలేదు, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి చేశాడని అన్నారు.