Jairam Ramesh: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి, ప్రజలను మభ్య పెట్టేందుకే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఎంపీలను విదేశాలకు పంపిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపణలు చేశారు. వరల్డ్ వైడ్ గా మోడీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడంతో ఈ విధంగా నష్ట నివారణ చర్యలకు దిగాడని విమర్శలు గుప్పించారు. 2014 వరకు అఖిలపక్షాన్ని ఐక్యరాజ్యసమితికి పంపించి ఇండియా వాణిని వినిపించే సంప్రదాయం ఉండేది.. కానీ, ఆ సంప్రదాయాన్ని నరేంద్ర మోడీ ఆపివేశారని జైరాం రమేశ్ మండిపడ్డారు.
Read Also: Ranya Rao Gold Smuggling Case: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్.. కర్ణాటక హోంమంత్రికి బిగుస్తున్న ఉచ్చు..
ఇక, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ ఎంచుకున్న బలమైన విధానాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు పలు పార్టీలకు చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలతో 7 టీమ్స్‌ను ఏర్పాటు చేసి విదేశాలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున రాజకీయ రగడ కొనసాగుతుంది. ఎవరెవరిని పంపాలన్న విషయంలో ఆయా పార్టీలకే వదిలేసి ఉండాలని కొందరు పేర్కొనగా.. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమని కేంద్ర మైనార్టి శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.