Jairam Ramesh: ఏదో బలమైన కారణమే ఉంది.. ధన్‌ఖర్ రాజీనామాపై జైరాం రమేష్ వ్యాఖ్య
- ఏదో బలమైన కారణమే ఉంది
- ధన్‌ఖర్ రాజీనామాపై జైరాం రమేష్ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేయడం రాజకీయ నాయకులకు దిగ్భ్రాంతి కలిగించింది. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో ధన్‌ఖర్ ఉల్లాసంగానే కనిపించారు. అలాగే ఆయా పార్టీలకు చెందిన నాయకులతో కూడా ఉత్సాహంగానే సమావేశాలు నిర్వహించారు. కానీ సాయంత్రానికి ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. ఉన్నట్టుండి ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధన్‌ఖర్ ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. అనారోగ్య కారణాల చేత పదవి నుంచి వైదొలగుతున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Gita Gopinath: గీతా గోపీనాథ్ సంచలన నిర్ణయం.. ఐఎంఎఫ్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి
Also Read
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
అయితే ధన్‌ఖర్ రాజీనామాపై ప్రతిపక్ష పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏదో బలమైన కారణం ఉండొచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘ధన్‌ఖర్ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బిజినెస్ అడ్వైజరీ కమిటీకి అధ్యక్షత వహించారు. జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిరణ్ రిజిజుతో సహా పలువురు దీనికి హాజరయ్యారు. చర్చ అనంతరం సాయంత్రం 4.30కు మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అయితే మరోసారి భేటీకి రిజిజు, నడ్డా రాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ధన్‌ఖర్ మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. దీన్ని బట్టి నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4.30 మధ్య ఏదో పెద్ద విషయమే జరిగింది.’’ అని జైరాం రమేష్ అనుమానం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Vice-President: తదుపరి ఉపరాష్ట్రపతిగా పేర్లు పరిశీలన..! ఆ పార్టీ నేతకు ఛాన్స్!
‘‘రిజిజు, నడ్డా ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి గైర్హాజయ్యారు. ఈ క్రమంలోనే ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధన్‌ఖర్ ప్రకటించారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఇలా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దాన్ని మనం గౌరవించాలి. కానీ, అందుకు చాలా లోతైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది’ అని జైరాం రమేశ్ రాసుకొచ్చారు.
2022 ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్‌ఖర్‌కు 2027 ఆగస్టు వరకూ పదవీకాలం ఉంది. అంటే రెండేళ్లకు ముందుగానే పదవి నుంచి తప్పుకున్నారు. రాజ్యసభ సమావేశాలను ప్రస్తుతానికి డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న జేడీయూ నేత హరివంశ్ నడిపించనున్నారు. ఇక తదుపరి ఉపరాష్ట్రపతి రేసులో కూడా హరివంశ్ ముందున్నారు. త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరనున్నాయి. ఈ నేపథ్యంలో మిత్రపక్షంగా ఉన్న జేడీయూకు ఆ పదవి దక్కే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!